Reading Time: < 1 minute
Gold Price: బిగ్ రిలీఫ్.. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

భారతీయ సంస్కృతిలో పసిడిది ప్రత్యేక స్థానం. మహిళలు బంగారాన్ని కేవలం ఒక అలంకార వస్తువుగానే కాకుండా సెంటిమెంట్‌గా, కుటుంబ సౌభాగ్యానికి ప్రతీకగా, ఆపత్కాలంలో ఆదుకునే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. వివాహాలు, పండుగలు లేదా శుభకార్యాలు ఏదైనా సరే పసిడి కొంటుంటారు. అయితే గత ఏడాది కాలంగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలో ఆదివారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,200గా ఉంది. అలాగే 99.9శాతం స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,44,220గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర విషయానికొస్తే.. 10 గ్రాముల ధర రూ.1,08,160 వద్ద కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లు

మరోవైపు వెండి ధరల విషయానికి వస్తే, హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు వెండి ధరలు పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. భాగ్యనగరంలో ప్రస్తుతం 10 గ్రాముల వెండి ధర రూ.2,349 కాగా కేజీ వెండి ధర రూ.2,34,900గా ఉంది. పూజా సామాగ్రి, వెండి ఆభరణాలు, పటాలు కొనుగోలు చేసేవారికి ఈ స్థిరత్వం ఊరటనిచ్చే అంశం.

ప్రముఖ నగరాల్లో ఇలా

ఇక దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,44,370గా ఉంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,32,250గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,610గా ఉండగా, 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,32,560గా ఉంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల 10గ్రాముల బంగా ధర రూ.1,44,220 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,32,200గా ఉంది.

కొనుగోలుదారులకు సూచన

అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న మార్పులు, డాలర్ మారకం విలువ, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ప్రభావంతో ఇటీవల బంగారం, వెండి ధరల్లో నిరంతరం ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. వినియోగదారులు బంగారం లేదా వెండి కొనుగోలు చేసేటప్పుడు హాల్‌మార్క్ స్వచ్ఛతను పరిశీలించడంతో పాటు, బిల్లులో వర్తించే 3శాతం జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.