Reading Time: 2 minutes

నన్ను తాకాలని చూశాడు.. అబ్బాయిలను కూడా వదిలిపెట్టరా? క్యాస్టింగ్ కౌచ్‌పై విజయ్ వర్మ షాకింగ్ కామెంట్స్

Caption of Image.

బాలీవుడ్ నటుడు, తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ మరోసారి మరోసారి వార్తల్లో నిలిచారు. విజయ్ వర్మ (Vijay Varma) తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని తాజాగా వెల్లడించారు. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన సమయంలో ఓ మోడల్ కోఆర్డినేటర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చారు. ఆ సంఘటన తర్వాత మోడలింగ్‌ను వదిలేసి పూర్తిగా నటనపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లో చిన్న స్థాయిలో మోడలింగ్ చేసేవాడిని. ఆ సమయంలో ఓ మోడల్ కోఆర్డినేటర్ నాతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. నన్ను అసభ్యంగా తాకేందుకు చాలా ట్రీబ్ చేశాడు. దీంతో వెంటనే నిరుత్సాహానికి గురయ్యాను. అసలు ‘నువ్వేం చేస్తున్నావ్?’ అంటూ అతడిని ప్రశ్నించినప్పటికీ’’, నటననే నా లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానని” విజయ్ తెలిపారు.

మోడలింగ్‌ను వదిలిన తర్వాత హైదరాబాద్‌లోని ‘సూత్రధార్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్’లో చేరేందుకు ట్రై చేసిన ఛాన్స్ రాలేదని ఆయన గుర్తుచేసుకున్నారు. అనంతరం Film and Television Institute of India (ఎఫ్‌టీఐఐ)లో నటన కోర్సుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ మొదటి ప్రయత్నంలో ఎంపిక కాలేదన్నారు.

►ALSO READ | Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే పెళ్లి వార్తలు.. వరుడు అతనేనా? కొనసాగుతున్న సస్పెన్స్!

అయితే ఆ రిజెక్షన్ తనను వెనక్కి తగ్గించలేదని, మళ్లీ ప్రయత్నించి ఎఫ్‌టీఐఐలో ప్రవేశం పొందినట్లు తెలిపారు. అక్కడే నటులు రాజ్‌కుమార్ రావు, జైదీప్ అహ్లావత్ లతో కలిసి ట్రైనింగ్ తీసుకున్నట్లుగా విజయ్ వర్మ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తిరిగి వెనక్కి చూసుకోకుండా గల్లీ బాయ్, డార్లింగ్స్, జానే జాన్ వంటి చిత్రాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించినట్లుగా విజయ్ వెల్లడించారు. ప్రస్తుతం విజయ్ వర్మ మట్కా 2తో పాటుగా విభిన్న పాత్రలతో గుర్తింపు పొందుతూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

©️ VIL Media Pvt Ltd.