Reading Time: < 1 minute
Hridayam Murali Ott Release Date Locked Atharvaa Starrer Stream On Netflix

కోలీవుడ్ యంగ్ హీరో అథర్వ, ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ కథానాయికలుగా దర్శకుడు ఆకాష్ బాస్కరన్ తెరకెక్కించిన చిత్రం హృదయం మురళి. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ తమిళ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందనను సొంతం చేసుకుంది. చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న అథర్వకు ఈ సినిమా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు డిజిటల్ ప్రియర్ కు సిద్ధమైంది.

ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ‘హృదయం మురళి’ చిత్రాన్ని ఆగస్టు 7  నుంచి తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా లేక తెలుగు, మలయాళం, కన్నడ వంటి ఇతర దక్షిణాది భాషల్లో కూడా అందుబాటులో ఉంటుందా అనే విషయంపై సదరు ఓటీటీ సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకోవడంతో తెలుగు డిజిటల్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఆడియో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. తమన్ సంగీతానికి మాత్రమే కాదు పర్ఫామెన్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.