
హీరోయిన్ తేజస్వీ మదివాడ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని అమ్మాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఐస్ క్రీమ్, హార్ట్ ఎటాక్, మళ్లీ మళ్లీ ఇది రోజు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా విపరీతమైన పాపులారిటిని సొంతం చేసుకుంది. చాలాకాలంగా సినిమాలు తగ్గించిన తేజస్వి ఇప్పుడు ఎక్కువగా టీవీ షోలలో సందడి చేస్తుంది. ఎప్పుడూ చలాకీగా సరదాగా నవ్వుతూ ఉండే ఆమె జీవితంలో ఎంతో విషాదం దాగి ఉంది. ఇంట్లో నుంచి పారిపోయి అనాథశ్రమంలో పెరిగింది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తాను ఎంతో కష్టపడ్డానని అన్నారు. తనకు కారు, ఇల్లు ఉన్నాయని, తాను చాలా సంపన్నరాలని ఐదు, ఆరు సంవత్సరాలుగా పుకార్లు ఉన్నాయని, అయితే తాను వాస్తవానికి చాలా పేద అమ్మాయినని ఎమోషనల్ అయ్యారు.
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
గత పదేళ్లుగా తన సొంత డబ్బుతోనే పరిశ్రమలో మనుగడ సాగిస్తున్నానని, అది చాలా భిన్నమైన పోరాటమని తేజస్వి వెల్లడించారు. బిగ్ బాస్ ఎందుకు చేశారు వంటి ప్రశ్నలకు స్పందిస్తూ.. ప్రజలు తనకు ఆహారం పెట్టరని ఆమె పేర్కొన్నారు. వీ కేర్ అనే అనాథాశ్రమంలో తాను పెరిగానని.. అక్కడ లభించిన మద్దతు గురించి చెప్పుకొచ్చారు. అక్కడున్నవారు ప్రపంచంలోనే ఉత్తమ వ్యక్తులని, వారు తనను చేరదీసి, రెండు సంవత్సరాలు చూసుకున్నారని, తన కళాశాల ఫీజులకు కూడా సహాయం చేశారని వివరించారు. అనాథాశ్రమం తర్వాత, ఒంటరిగా ఉన్న ఒక వృద్ధురాలిని (తనకు తెలియని అమ్మమ్మ) ఇంట్లో చూసుకున్నానని, కళాశాలకు వెళ్తూనే ఆమెతో ఉన్నానని గుర్తు చేసుకున్నారు.
ఎక్కువమంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
11 సంవత్సరాల వయసులో తన తల్లి క్యాన్సర్‌తో మరణించిందని అన్నారు. తల్లి మరణం తర్వాత తన తండ్రి మద్యపానానికి బానిసయ్యారని ఆమె తెలిపారు. ఈ పరిణామాల వల్ల తేజస్వి తొమ్మిదో తరగతి చదువుకోలేకపోయారు, నేరుగా పదవ తరగతి చదివారు. తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై పడటమే దీనికి కారణమని చెప్పారు. తన 15వ ఏట నుంచే 18 ఏళ్లు రాగానే ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తేజస్వి వివరించారు. మేజర్ అయిన తర్వాత ఎవరూ తనను ఆపలేరని ఆమె భావించానని.. అందుకే తనకు 18 ఏళ్లు నిండగానే జూలై నెలలో, సెప్టెంబర్‌లో ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక అనాథాశ్రయంలో చేరినట్లు గుర్తు చేసుకున్నారు. అక్కడ ఆశ్రయం పొందుతూనే, డ్యాన్స్ టీచర్‌గా పనిచేశారు. ఆ విధంగా సంపాదించిన డబ్బుతోనే తన కాలేజీ ఫీజులను స్వయంగా చెల్లించుకున్నారు. తన కష్టాల గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఆమె ఇష్టపడరు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
తేజస్వీ మదివాడ ఇన్ స్టా పోస్ట్..
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..