
న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శనివారం (జనవరి 3) ఎంపిక చేసింది. శుభ్‌మాన్ గిల్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లకు జట్టులో స్థానం దక్కింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకున్న అయ్యర్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. అయ్యర్ రావడంతో గైక్వాడ్ కు 15 మంది స్క్వాడ్ లో చోటు దక్కలేదు.
న్యూజిలాండ్ తో సిరీస్ కు భారత వన్డే జట్టు :
గిల్(కెప్టెన్), రోహిత్, కోహ్లి, రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ, కుల్దీప్ యాదవ్, పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్షీప్ సింగ్, జైస్వాల్
🚨 News 🚨
India’s squad for @IDFCFIRSTBank ODI series against New Zealand announced.
Details ▶️ https://t.co/Qpn22XBAPq#TeamIndia | #INDvNZ pic.twitter.com/8Qp2WXPS5P
— BCCI (@BCCI) January 3, 2026