Reading Time: < 1 minute

ఖమ్మంలో 250 మందిపై కేసులు నమోదు : ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు

Caption of Image.

ఖమ్మం టౌన్, వెలుగు :  నూతన సంవత్సరం సందర్భంగా బుధ, గురువారాల్లో నగర పరిధిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారని, నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన 76 మంది వాహనదారులతో పాటు కమిషనరేట్ వ్యాప్తంగా 250 మందిపై కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. తనిఖీల్లో పట్టుబడినవారిలో కొందరికి శిక్షతోపాటు రూ.2 వేలకుపైగా జరిమానా విధించారన్నారు.

©️ VIL Media Pvt Ltd.