
కొడంగల్, వెలుగు: భక్తులు మెచ్చేలా శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపడుతామని కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి అన్నారు. ప్రభుత్వం కొడంగల్‌లో రూ.110 కోట్లతో చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులను బుధవారం భూమిపూజ చేసి ప్రారంభించారు. శ్రీవారి ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.
కాకతీయుల కాలం నాటి శిల్పకళ ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం ఉంటుందని, ప్రత్యేకంగా కృష్ణ శిలలు తెప్పించినట్లు చెప్పారు. మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్, వైస్ చైర్మన్ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.