Reading Time: 2 minutes
OTT Movie: నెగిటివ్ టాక్‌తోనూ 200 కోట్ల కలెక్షన్లు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే దృశ్యం చిత్రాలనే పేర్కొంటారు. విడుదలైన ప్రతి భాషలోనూ ఈ సిరీస్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక దృశ్యం సినిమాలకు ఆద్యుడు డైరెక్టర్ జీతూ జోసెఫ్ అని చెప్పవచ్చు. ఆయన దర్శకత్వంలో మోహన్ లాల్ ఈ సినిమాల్లో హీరోగా నటించారు. ఇప్పటివరకు ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టాయి. ఈ క్రేజీ సిరీస్ నుంచి వచ్చిన మరో సినిమా ‘దృశ్యం 3’. మొదటి రెండు భాగాలను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ నే మూడో సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. మోహన్ లాల్ 66వ పుట్టినరోజు సందర్భంగా దృశ్యం 3 సినిమా మే 21 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. అయితే మొదటి రెండు భాగాలతో పోలిస్తే ఈ మూడో పార్ట్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చెప్పుకోదగ్గ రీతిలో లేవని కామెంట్స్ వచ్చాయి. కాగా తెలుగులో దృశ్యం మొదటి రెండు భాగాలను వెంకటేష్ తో రీమేక్ చేయించారు. అయితే మూడో పార్ట్ అలా జరగలేదు. ఒరిజినల్ వెర్షన్ నే తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ తమిళంలో ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. సుమారు రూ. 200 కోట్ల మేర వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ దృశ్యం 3 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. జూన్ 18 నుంచి ఈ సినిమాను ఓటీటీలోకితీసుకొస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే గురువారం (జూన్ 18) అర్ధరాత్రి నుంచే దృశ్యం 3 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వచ్చింది

 

అయితే దృశ్యం 3 సినిమా తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కు సంబంధించి ఒక వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడీ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ అదుబాటులోకి వచ్చింది. దృ శ్యం 3 సినిమా విషయానికి వస్తే.. ఆశీర్వాద్‌ సినిమాస్‌, పనోరామా స్టూడియోస్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన దృశ్యం 3 సినిమాలో మోహన్ లాల్ సరసన మీనా కథానాయికగా నటించింది. అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, కళాభవన్‌ షాజోన్, సిద్ధిఖ్, మురళీ గోపి, ఆశా శరత్, బిజూ మేనన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిల్‌ జాన్సన్‌ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. దృశ్యం సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ దృష్ట్యా ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో దృశ్యం 3

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.