Reading Time: < 1 minute

గోదావరి పుష్కరాలకు 86 కోట్లు..భద్రాచలంలో రూ.కోటిన్నరతో భక్తులకు డార్మెటరీ హాల్

Caption of Image.

భద్రాచలం, వెలుగు: గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.86.70 కోట్లు కేటాయించింది. అలాగే, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కొత్త డార్మెటరీ హాల్ నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు చేసింది. అంబసత్రం దగ్గర జీ ప్లస్ మోడల్‌‌లో ఈ హాల్‌‌ను నిర్మించనున్నట్లు దేవస్థానం ఈవో దామోదర్ రావు తెలిపారు.

గోదావరి పరీవాహక ప్రాంతంలోని కందకుర్తి(నిజామాబాద్​), బాసర (నిర్మల్​), మంగపేట (ములుగు), కొండవటంచ (జయశంకర్​భూపాల్​పల్లి), భద్రాచలం (భద్రాద్రికొత్తగూడెం), మంచిర్యాల, కాళే శ్వరం (జయశంకర్​ భూపాల్​పల్లి), మంథని, ఓదెల (పెద్దపల్లి), కోటిలింగాల, ధర్మపురి (జగిత్యాల) ప్రాంతాల్లో పుష్కరాల ఏర్పాట్ల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు.  

©️ VIL Media Pvt Ltd.