
దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు భారీ గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధుల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నగదును జూన్ 20వ తేదీన లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ ద్వారా దేశంలోని అన్నదాతలకు అందించనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక ఎక్స్ ఖాతాలో దీని గురించి ప్రకటన చేశారు. అలాగే అగ్రికల్చర్ ఇండియా, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఎక్స్ అకౌంట్లో కూడా దీని గురించి ప్రకటన వచ్చింది.
రైతుల ఖాతాల్లో జమ
“ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ 23వ విడత నగదును జూన్ 20న పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో విడుదల కానుంది. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా భారతదేశంలోని అన్నదాతలకు సాధికారత కల్పించడంలో మనం మరో మైలురాయి వైపు పయనిస్తున్నందున తాజా సమాచారం కోసం వేచి ఉండండి” అంటూ ఎక్స్‌లో ప్రకటన చేశారు. 22వ విడత నగదును అసోంలోని గువహటి వేదికగా మార్చి 13వ తేదీన మోదీ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల 46 లక్షల 15 వేల 309 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. రూ.4.28 లక్షలకుపైగా ఆర్ధిక సాయం చేశారు. ఇందులో రూ.1.01 లక్షల కోట్ల మంది మహిళా లబ్దిదారులు ఉన్నారు.
రెండు రోజులే టైమ్
ఇక రెండు రోజులు మాత్రమే పీఎం కిసాన్ నిధుల విడుదలకు టైమ్ మిగిలి ఉంది. దీంతో రైతులు ఈ నగదు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. నైరుతి రుతుపవనాల రాకతో రైతులు పంటలు వేస్తున్నారు. పీఎం కిసాన్ నగదు రైతుల పెట్టుబడికి ఉపయోగపడనుంది. రూ.2 వేలను రైతు ఖాతాల్లో వేయనున్నారు. పీఎం కిసాన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు 18001801551 హెల్ప్ లైన్ నెంబర్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుంది.155261 నెంబర్ ద్వారా కూడా సహాయం పొందవచ్చు. ఇక పీఎం కిసాన్ అధికార వెబ్ సైట్, యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు. మీ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవడం వల్ల మీకు నిధులు వస్తాయా.. లేదా అనేది తెలుసుకోవచ్చు. అలాగే సమస్యల ఉంటే అందులోనే ఫిర్యాదు చేయవచ్చు.
The 23rd Instalment of PM Kisan Samman Nidhi is scheduled to be released on:
20th June 2026
Tarakeswar, Hooghly, West Bengal
Stay tuned for updates as we move towards another milestone in empowering India’s Annadatas through Direct Benefit Transfer.#PMkisan pic.twitter.com/AktMtIMW29
— PM Kisan Samman Nidhi (@pmkisanofficial) June 17, 2026
20th June 2026
Tarakeswar, Hooghly, West Bengal