
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉంటున్న మన దేశానికి చెందిన షాజీర్ వెంగకు జాక్‌పాట్ తగిలింది. బ్యాంకు ఖాతా రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. సేవింగ్స్ కోసం తెరిచిన బ్యాంకు ఖాతా ఏకంగా రూ.5.15 కోట్ల నగదు బహుమతి తగిలింది. షార్జా ఇస్లామిక్ బ్యాంక్ (ఎస్‌ఐబీ) నిర్వహించిన ‘మిలియనీర్ క్యాంపెయిన్’ లక్కీ డ్రాలో ఆయన విజేతగా నిలిచారు.
షజీర్ రెండు నెలల కింద డిజిటల్ యాప్ ద్వారా ఎస్‌ఐబీలో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఖాతా తెరిచిన కొద్ది రోజులకే ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఈ గిఫ్ట్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందంటూ షజీర్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడ్తానని, భారత్‌లో ఉన్న తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకువచ్చి హ్యాపీగా చూసుకుంటానని చెప్పారు. ఇదే లక్కీ డ్రాలో యూఏఈకి చెందిన వ్యక్తి బీఎండబ్ల్యూ కారును గెలుచుకోగా, మరో 40 మంది విజేతలకు నగదు బహుమతులు లభించాయి.