Reading Time: < 1 minute

హైదరాబాద్లో టెస్లా షోరూమ్..మార్కెట్లోకి రెండు మోడల్స్

Caption of Image.
  • ధరలు రూ.50 లక్షల నుంచి షురూ

హైదరాబాద్​, వెలుగు: ప్రపంచ కుబేరుడు ఎలాన్​మస్క్​కు చెందిన ఎలక్ట్రిక్ ​వెహికల్స్ ​కంపెనీ టెస్లా హైదరాబాద్​లోని నాలెడ్జ్ సిటీలో ఎక్స్​పీరియెన్స్​ సెంటర్​ను ప్రారంభించింది. ఈ కేంద్రంలో 2026 మోడల్ వై ప్రీమియం రియర్ -వీల్ డ్రైవ్, ఆరు సీట్ల మోడల్ వై ఎల్ కార్లను ప్రదర్శిస్తున్నారు.  డెలివరీ, అమ్మకాల తర్వాత సేవలను బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలోని కేంద్రం నుంచి అందిస్తారు. 

కార్ల చార్జింగ్​ కోసం ప్రధాన నగరాలను కలుపుతూ సూపర్​ చార్జర్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్​ను ఏర్పాటు చేస్తున్నట్లు టెస్లా తెలిపింది. ఢిల్లీ, జైపూర్, చండీగఢ్, ముంబై, పుణె, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలను కలుపుతూ చార్జింగ్ కారిడార్లను నిర్మిస్తోంది. ఇంట్లో చార్జింగ్ చేసుకోవడంపైనే సంస్థ ఎక్కువ దృష్టి పెట్టింది. ప్రతి కారుతో వాల్ కనెక్టర్​ను ఉచితంగా అందిస్తోంది. బ్యాటరీపై ఎనిమిదేళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఉంటుంది. 

నో  మెయింటెనెన్స్

 టెస్లా కార్లకు పీరియాడిక్ మెయింటెనెన్స్ ఉండదు. చాలా సమస్యలను రిమోట్​గానే పరిష్కరిస్తారు. అవసరమైనప్పుడు మొబైల్ సర్వీస్ టీమ్​లు వినియోగదారుల వద్దకు వస్తాయి. టెస్లాను కేవలం కార్ల తయారీ సంస్థగా కాకుండా, ఏఐ, టెక్ ​కంపెనీగా పరిగణించాలని సంస్థ పేర్కొంది. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ల ద్వారా వాహనాల్లో కొత్త ఫీచర్లను చేరుస్తారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా 250కి పైగా ఫీచర్లను ఇలాగే అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ చేశారు. 

గ్రోక్ ఏఐ అసిస్టెంట్ కూడా అందుబాటులోకి వచ్చింది. మోడల్ వై ప్రీమియం ధర రూ.50.89 లక్షలు కాగా, 500 కిలోమీటర్ల మైలేజ్​ ఇస్తుంది. 2,138 లీటర్ల వరకు సామానలను ఉంచుకోవచ్చు. 0–100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలోనే అందుకుంటుంది. ఆరు సీట్ల మోడల్ వై ఎల్ ధర రూ.61.99 లక్షలు కాగా, 681 కిలోమీటర్ల  మైలేజ్ ​ఇస్తుంది. ఈ వాహనం 5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 2,539 లీటర్ల సామాన్లను పెట్టుకోవచ్చు.

©️ VIL Media Pvt Ltd.