Reading Time: < 1 minute
Thursday Horoscope June 18 2026 Daily Astrology Predictions For All Zodiac Signs

June 18 2026 Horoscope: కన్య రాశి వారు ఊహాలోకాల్లో విహరిస్తూ ఇతరులకు మీ శక్తికి మించిన వాగ్దానాలు లేదా హామీలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారనుకో.. భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగాలలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. స్నేహితులను, బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. అమ్మవారి రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.

కుంభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాలలో ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన మొండి బాకీలను ఈరోజు సమర్థవంతంగా వసూలు చేసుకోగలుగుతారు. ఇతరులతో ఉన్న పాత అనుబంధాలు, పరిచయాలు కలిసివస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. అనుకూలించే దైవం.. లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. భక్తి టీవీ వేదికగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 18 జూన్ 2026 నాటి దిన ఫలాలలు అందించారు. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.