Reading Time: < 1 minute
Ycp Mp Mithun Reddy Slams Centre On Ap Special Status Warns Over Delimitation Bill

MP Mithun Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చారు.. కానీ, ఆ తర్వాత చట్టంలో లేదని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభా పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి.. మహిళా బిల్లు, డీలిమిటేషన్‌ బిల్లుపై లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా డీలిమిటేషన్‌ను వాడొద్దు.. దేశాన్ని నిర్మించడానికి డీలిమిటేషన్‌ ఉపయోగపడాలని హితవు తెలిపారు..

Read Also: Vidadala Rajini: మహిళా బిల్లుకు వైసీపీ సంపూర్ణ మద్దతు.. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మకం

మరోవైపు, ఏపీలో అన్ని ప్రాంతాల్లో సీట్లు సమానంగా ఉండాలని.. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో సీట్లను సమానంగా కేటాయించాలని.. అప్పుడే డీలిమిటేషన్‌కు సార్థకత ఉంటుందని.. సీట్ల పంపకాలు సరిగా జరగకపోతే వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని ఇప్పటికే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేయగా.. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్‌ బిల్లు కారణంగా ఏపీలో ఒక్క సీటు తగ్గినా, రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకోబోమని వైసీపీ లోక్‌సభా పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెగేసి చెప్పిన విషయం విదితమే.. డీలిమిటేషన్‌ వల్ల ఏపీకి ఏదైనా అన్యాయం జరిగితే ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు ఎంపీ మిథున్‌ రెడ్డి..