Reading Time: < 1 minute
Jailer 2 Scenes Leaked Rajinikanth Movie Social Media Viral

Jailer 2 Scenes Leaked: గత కొన్ని నెలల నుంచి సినిమాలు రిలీజ్‌కి ముందే లీక్స్ అవుతున్నాయి. మొన్న జననాయక్ మూవీ విడుదలకు ముందే లీకైన ఘటన మరవక ముందుగానే మరో అంశం వెలుగులోకి వచ్చింది. జైలర్ 2కి సంబంధించి రెండు సీన్లు లీక్ అయ్యాయి. రజనీకాంత్ ‘జైలర్-2’ సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ​మూవీ లీకేజీతో చిత్ర యూనిట్ షాక్ అయ్యింది. ​క్లిప్స్‌ను షేర్ చేయవద్దని జైలర్-2 నిర్మాతలు కోరుతున్నారు. ​కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో జైలర్-2 నిర్మిస్తున్నారు. ​లీకైన వీడియోల ప్రచారంపై నిర్మాణ సంస్థ సీరియస్ అయ్యింది. ​పైరసీ నిరోధక టీమ్ నిరంతర పర్యవేక్షణ చేస్తోంది. ​వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ​ఇక దిలీప్ కుమార్ జైలర్ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ​లీకేజీ అంశంపై మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

READ MORE: How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..

ఇదిలా ఉండగా.. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్‌’ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ కలయికలోనే ఇప్పుడు ‘జైలర్‌ 2’ రూపొందించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం జైలర్ 2. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో మలయాల స్టార్ మోహన్ లాల్ సైతం నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌ పాత్ర అలరించనుంది. కూలీ కాస్త నిరాశపరచడంతో జైలర్ 2తో సాలిడ్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలోని సీన్స్ లీక్ అవ్వడం గందరగోళాన్ని సృష్టిస్తోంది.

READ MORE: Vidadala Rajini: మహిళా బిల్లుకు వైసీపీ సంపూర్ణ మద్దతు.. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మకం