Reading Time: 2 minutes
Up Ats Terror Module Busted Pakistan Handlers Railway Plot

Terror Module: రోజు రోజుకూ దేశంలో దేశ ద్రోహులు పెరిగిపోతున్నారు. ఈ దేశం తిండి తిని, ఈ దేశం నీళ్లు తాగుతూ పాకిస్థాన్‌కు, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న వాళ్లు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ పోలీసులు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఓ భారీ ఉగ్రవాద ముఠా గుట్టురట్టయింది. రాజస్థాన్‌కు చెందిన రాజురామ్ గోదారా, బిజ్నోర్‌కు చెందిన సమీర్ అలియాస్ రోహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ అనంతరం దర్యాప్తు చేయగా సంచలన కుట్ర వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మీరట్‌లో పట్టుబడిన షాకిబ్‌తో కలిసి ఈ ఇద్దరు పాకిస్థాన్ హ్యాండ్లర్ల కనుసన్నల్లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్ గ్రూపులు, వీడియో కాల్స్ ద్వారా యువతకు బ్రెయిన్ వాష్ చేయడం, ఆయుధ శిక్షణ ఇవ్వడం వీరి ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నారు. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా భారీ రైలు ప్రమాదాలకు పాల్పడాలని పక్కా ప్లాన్ చేశారట. రద్దీగా ఉండే ప్రాంతాల్లో పేలుళ్లు జరపాలని, హిందూ నాయకులను లక్ష్యంగా చేసుకుని రెక్కీ నిర్వహించాలని పక్కా స్కెచ్ వేశారట. విదేశాల్లో ఉంటున్న ఆకిబ్, మైజుల్, ఆజాద్ అనే వ్యక్తులు ఈ మొత్తం నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

READ MORE: Jailer 2 Scenes Leaked: ‘జైలర్ 2’ రెండు సీన్లు లీక్.. సోషల్ మీడియాలో రజనీకాంత్ వీడియోలు వైరల్!

ఈ టెర్రర్ మాడ్యూల్ పనితీరు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పోలీసుల దర్యాప్తులో వెలువడిన సమాచారం ప్రకారం.. బిజ్నోర్‌లో పట్టుబడిన సమీర్ వద్ద విధ్వంసం సృష్టించాల్సిన ప్రాంతాల లొకేషన్లు, ఆయుధాల ఫోటోలు లభించాయట. ఇతడు వీడియో కాల్స్ ద్వారా సౌదీ అరేబియాలో ఉన్న ఆకిబ్, సౌత్ ఆఫ్రికాలో ఉన్న మైజుల్, ఆజాద్‌లకు ఆయుధాలను చూయించేవాడట. మరోవైపు రాజస్థాన్‌లో పట్టుబడిన రాజురామ్ గోదారా, ఈ ఉగ్ర ముఠా నిర్వహిస్తున్న టెలిగ్రామ్ గ్రూపునకు అడ్మిన్‌గా వ్యవహరిస్తున్నాడు. నిమిష్ రస్తోగి అనే వ్యక్తి కారును తగులబెట్టి, ఆ వీడియోను షాకిబ్‌కు పంపడం ద్వారా తన విధేయతను చాటుకున్నాడు. షాకిబ్, అర్బాబ్, వికాస్, లోకేష్‌లతో కలిసి రైలు సిగ్నల్ వ్యవస్థను పాడుచేసి భారీ ప్రాణనష్టం కలిగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో అరాచకం సృష్టించి మత సామరస్యాన్ని దెబ్బతీయడమే వీరి అసలు ఉద్దేశంగా పోలీసులు వెల్లడించారు.

READ MORE: Ghattamaneni Family : ఘట్టమనేని మూడో తరంలో స్టార్‌ అయ్యేదెవరు?