Reading Time: < 1 minute
Raghav Chadha Z Category Security Centre Aap Row Parliament Special Session

రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు అనూహ్యంగా కేంద్రం జెడ్ కేటగిరీ భద్రత కల్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో రాఘవ్ చద్దాకు ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించని షాకిచ్చింది. సభలో రాఘవ్ చద్దాకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాసింది. దీంతో రాఘవ్ చద్దా తీవ్ర షాకింగ్‌కు గురయ్యారు. అనంతరం ఆప్ నేతలు తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. మోడీకి భయపడి.. ఎయిర్‌పోర్టుల్లోని సమోసాల ధరల గురించి మాట్లాడారంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడంతో ఆప్ ప్రభుత్వం భద్రత కూడా ఉపసంహరించుకుంది.

ఇదిలా ఉంటే రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాఘవ్ చద్దాకు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పరిణామం దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భద్రత వివరాలపై అధికారిక సమాచారం వెలువడకపోయినప్పటికీ… కేంద్ర నిర్ణయం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉంటే రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. ప్రస్తుతం ఉన్న 543 ఎంపీల సంఖ్యను 850కి పెంచే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. అయితే డీలిమిటేషన్ బిల్లుపై మాత్రం దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

జెడ్ కేటగిరీ..
జెడ్ కేటగిరీ (Z Category) భద్రత అనేది భారతదేశంలో తీవ్రమైన ముప్పు ఉన్న ప్రముఖులకు కల్పించే అత్యున్నత భద్రతా స్థాయిల్లో ఒకటి. ఈ భద్రతలో 22 మంది వరకు సాయుధ సిబ్బంది (4-6 మంది NSG కమాండోలతో సహా) రక్షణ కల్పిస్తారు. ఇది ప్రధానంగా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉన్నత స్థాయి ముప్పు ఉన్నవారికి మాత్రమే కల్పిస్తారు.

ఇది కూడా చదవండి: Vijay: డీలిమిటేషన్‌తో తమిళనాడుకు నష్టం.. పక్షపాత చర్య వద్దని విజయ్ హితవు