Reading Time: < 1 minute
Keesara Bmw Accident Twist Not Brake Failure Toll Plaza Technical Glitch Revealed

Keesara BMW Accident Twist: ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా దగ్గర BMW కారు ప్రమాదానికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కారుపై ట్యాంకర్ బోల్తా పడడానికి కారణం బ్రేక్ ఫెయిల్ కాదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ ఇచ్చారు. టోల్ ప్లాజాలో టెక్నికల్ సమస్యతోనే కారు ఎక్కువసేపు అక్కడ నిలిచిపోయిందని, దీంతో ప్రమాదం భారిన పాడిందని తేలింది. ఫాస్ట్ ట్యాగ్ తో టోల్ చెల్లించేందుకు లైన్ లో ఉన్న BMW కారుపై అకస్మాత్తుగా వెనక నుంచి తీసుకొచ్చిన ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో కారు నుజ్జు నుజ్జ అయింది. కారులో ఉన్న లాయర్ శ్రీనివాసరావు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు.

Virat Kohli: కోహ్లీ నా మజాకా.. బాబర్ ఆజామ్‌కు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ.. బిగ్ రికార్డుతో స్ట్రాంగ్ కౌంటర్!!

తాజాగా ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ట్యాంకర్ డ్రైవర్ ఆంటోనీని అదుపులోకి తీసుకున్న వెంటనే బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కారుపై పడిందని చెప్పాడు. ఈ ట్యాంకర్ ను నందిగామ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పూర్ణిమ పరిశీలించారు. ట్యాంకర్ కండిషన్ అంతా బానే ఉందని బ్రేక్ ఫెయిల్ కాలేదని రిపోర్ట్ ఇచ్చారు. దీనితో కీసర టోల్ దగ్గర ప్రమాదానికి దారితీసిన ఇతర కారణాలు ఏంటనే దానిపైన పోలీసులు దృష్టి సారించారు. టోల్ రుసుం చెల్లించే సందర్భంలో టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు. సాధారణంగా ఒక వాహనం టోల్ రుసుమ్ చెల్లించి అక్కడి నుంచి వెళ్ళడానికి 3 సెకన్ల నుంచి 7 సెకన్ల సమయం పడుతుంది.

Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్‌..

అయితే ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు BMW కు ముందు ఉన్న కారుకు టోల్ రుసుమును చెల్లిస్తున్నప్పుడు ఫాస్ట్ ట్యాగ్ యూపిఐకి సంబంధించి టెక్నికల్ ఇష్యూతో సుమారు 30 సెకన్ల పాటు అక్కడే నిలిచి ఉంది. అప్పటికే ఈ కారు వెనక నిలబడి ఉంది. అదే సమయంలో హఠాత్తుగా ట్యాంకర్ దూసుకొచ్చి బోల్తా పడడంతో ఘోర ప్రమాదం జరిగింది. మొత్తంగా టోల్ ప్లాజా వద్ద టెక్నికల్ సమస్య వచ్చినట్లు సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.