Reading Time: < 1 minute
గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్న విద్యార్థిని.. కాసేపటి తర్వాత కిటికిలోంచి చూడగా..

ఆదివారం సెలవు కావడంతో విద్యార్థినులంతా సరదాగా గడుపుతున్నారు. ఉన్నట్లుండి తనకు ఒంటరిగా ఉండాలని ఉందని చెప్పి శ్వేత తన గదిలోకి వెళ్లింది. అయితే సాయంత్రం ఫోన్ చేసిన తల్లిదండ్రులకు శ్వేత నుండి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఆమె స్నేహితురాలికి ఫోన్ చేసి శ్వేతతో మాట్లాడించాలని చెప్పారు. ఆమె వెళ్లి తలుపు కొట్టగా తీయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి తొంగి చూడగా ఫ్యాన్ కు వేలాడుతూ శ్వేత కనిపించింది. వెంటనే యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం అందించగా రంగంలోకి దిగిన సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్వేత చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.

హైదరాబాద్ నగరంలోని నిజాం పేట ప్రాంతానికి చెందిన శ్వేతా అమృత యూనివర్సిటీలో బిటెక్ నాలుగో ఏడాది చదువుతుంది. అందరితో సరదా ఉంటే శ్వేత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. అంతకముందు ఆమె రాసిన సూసైడ్ లేఖ ఆ రూంలో ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నన్ను క్షమించండి అంటూ లేక మొదలు పెట్టిన శ్వేత… నా చావుకు ఎవరూ కారణం కాదు. ఎవరిని నిందించవద్దు.. నాకు బ్రతకాలని లేదు అంటూ సూసైడ్ లేఖలో రాసింది. నా కోసం ఎంతో చేసిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పింది. నా ఆత్మహత్యను ప్రచారం చేసి నా తల్లిదండ్రులకు బాధ కల్గించవద్దని వేడుకున్న ఆమె.. ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పింది.

అమృతా యూనివర్సిటీలో విద్యార్థిని మరణంతో స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఎయిమ్స్ లోని మార్చురీ వద్దకు చేరుకొని విషాదంలో మునిగిపోయారు. ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్దం కావడం లేదన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..