
వైవిధ్యమైన కథలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి సరికొత్త చిత్రంలో రెడీ అయ్యారు. తెలంగాణ జానపద గీతాలు, ప్రైవేటు ఆల్బమ్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగదుర్గ ఈ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు ( జూన్ 25, 2026 ) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ప్రతి ఇంటి కథ..
తెలంగాణ వాడుక భాషలో ‘ఇడుపు కాయితం’ అంటే ‘విడాకుల పత్రం’ అని అర్థం. టైటిల్ ప్రకటనతోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈచిత్రాన్ని టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌసెస్ సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
The fragrance of our roots. The story of every home 🏠@SukumarWritings & @BunnyVasWorks proudly present their first production, #IdupuKayitham ❤️📃
A heartfelt family drama from two creative forces coming together💥
Shoot Begins Soon🎥@aryasukku @Thabithasukumar… pic.twitter.com/Y8ekCyp0k1
— BV Works (@BunnyVasWorks) June 25, 2026
15 రూల్స్ పెట్టిన హీరోయిన్..
ఈ సినిమాలో హీరోయిన్‌గా నాగదుర్గను సంప్రదించినప్పుడు.. ఆమె ఏకంగా 15 కండిషన్లు పెట్టిందని నిర్మాత బన్నీ వాస్ తెలిపారు. ఒక తెలుగు అమ్మాయి తన కెరీర్, పద్ధతులపై ఇంత క్లారిటీగా ఉండటం చూసి తాను ఎంతో ఆనందించానని ఆయన చెప్పుకొచ్చారు. ‘మన మూలాల సువాసన.. ప్రతి ఇంటి కథ’ అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమా భార్యాభర్తల అనుబంధం, కుటుంబ భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి అత్తగారు తన కోడలి చేయి పట్టుకుని ఎమోషనల్‌గా బయటకు రావడం గ్యారెంటీ అని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.
►ALSO READ | Naveen Polishetty: ఇది కదా ఫ్రేమ్ అంటే! నవీన్ పోలిశెట్టి రూ.5 వేల కోట్ల కాస్ట్లీయెస్ట్ రీల్ వైరల్!
ఈ తెలుగు సినిమాను బిహార్‌లో రిలీజ్ చేసినా కనెక్ట్ అయ్యేలా యూనివర్సల్ ప్రాబ్లమ్‌తో వంశీ రెడ్డి ఈ కథను డిజైన్ చేశారని సుకుమార్ భార్య తబిత సైతం ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ ‘ఇడుపు కాయితం’ ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.