Reading Time: 2 minutes

Bigg Boss Telugu 10: నాగార్జున గారు ‘ఒక్క ఛాన్స్’.. బిగ్ బాస్ కంట్లో పడబోయి.. డీజీపీ కంట్లో పడ్డ ఎస్సై.!

Caption of Image.

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ కు ఉన్న అదరణ అంతా ఇంతా కాదు. ఈ షో వస్తుందంటే చాలు.. తమ పనులు కూడా పక్కపెట్టేసి టీవీ ముందు వాలిపోతారు. ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ల్యాండ్ మార్క్   ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’తో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతోంది.  హోస్ట్ కింగ్ నాగార్జున ‘దశావతారం’ అనే క్రేజీ కాన్సెప్ట్.. ‘ఈసారి ఆట కాదు.. ఆటే సవాల్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో సరికొత్త ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు. 

‘అగ్ని పరీక్ష 2’ రెడీ

ఈ క్రమంలోనే సామాన్యులకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చేందుకు ‘అగ్ని పరీక్ష 2’ రౌండ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. సామాన్యులకు ఇదోక అద్భుత అవకారం. ఇప్పటికే అప్లికేషన్లు కూడా స్వీకరించారు.  త్వరలోనే ఎంపిక చేసిన అభ్యర్థుల లిస్ట్ బయటకు రానుంది.  అయితే, ఈసారి హౌస్‌లోకి వెళ్లేందుకు వచ్చిన ఒక వినూత్న అప్లికేషన్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

►ALSO READ | నిర్మాతలకు రూల్స్ పెట్టిన హీరోయిన్.. ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ మూవీపై బన్నీ వాస్ ఇంట్రెస్టింగ్ లీక్స్!

డీజీపీ కంట్లో పడ్డ ఎస్సై..

సోషల్ మీడియాలో ఎంతోమంది సామాన్యులు ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అంటూ వీడియోలు చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ చేసిన సెల్ఫీ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నంద్యాల జిల్లా గడివేముల పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగార్జున రెడ్డి.. తనకు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఇవ్వాలంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. బిగ్ బాస్ మేకర్స్ కంట్లో పడి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయన ఆశపడితే.. చివరకు ఈ వీడియో కాస్తా వైరల్ అయ్యి ఏపీ డీజీపీ కంట్లో పడటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మైండ్ గేమ్‌కు ఖాకీ రెడీ..

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటూ నిత్యం ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు, నేరాలు, మానసిక సవాళ్లను ఎదుర్కొంటున్నాను. బిగ్ బాస్ హౌస్‌లో ఆడే ఎలాంటి మైండ్ గేమ్‌నైనా నేను తట్టుకోగలను. నాలోని లీడర్‌షిప్ క్వాలిటీస్ ఏంటో నిరూపించుకుంటా అంటూ ఎస్సై నాగార్జున రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ చేశారు.  బిగ్ బాస్ షోను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే తన ఇద్దరు కూతుళ్లు ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు.

 

అయితే, ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్న ఒక పోలీస్ అధికారి ఇలాంటి రియాలిటీ షోలలో పాల్గొనడానికి డిపార్ట్‌మెంట్ రూల్స్ ఒప్పుకుంటాయా? ఆయనకు పర్మిషన్ దొరుకుతుందా? అనే సందేహాలు నెటిజన్లలో వ్యక్తమవుతున్నాయి. గత సీజన్‌లో కామనర్ అయిన పడాల కల్యాణ్ టైటిల్ విన్నర్‌గా నిలవడంతో ఈసారి ‘అగ్ని పరీక్ష’ ద్వారా హౌస్‌లోకి వెళ్లాలనే క్రేజ్ మరింత పెరిగింది. మరి ఈ ఖాకీ ఆఫీసర్‌కు బిగ్ బాస్ హౌస్ నుండి పిలుపు వస్తుందో లేదో చూడాలి..

 

©️ VIL Media Pvt Ltd.