Reading Time: < 1 minute

రంగారెడ్డి రైజర్స్‌ జోరుకు బ్రేక్.. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం

Caption of Image.

TG20 League 2026: టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు తమ విజయ పరంపరను కొనసాగిస్తూ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. రంగా రెడ్డి రైజర్స్‌తో జరిగిన హోరాహోరీ పోరులో హైదరాబాద్ టీమ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో హైదరాబాద్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి సుడిగాలి ఇన్నింగ్స్‌తో కీలక పాత్ర పోషించి జట్టుకి విజయాన్ని అందించాడు. 

రంగారెడ్డి రైజర్స్ భారీ స్కోరు: 
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రంగారెడ్డి రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ రంగారెడ్డి బ్యాటర్లు పరుగుల వరద పారించారు. దీంతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ముందు బిగ్ టార్గెట్ ని పెట్టింది. 

చెలరేగిన కెప్టెన్ అభిరథ్: 
196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టుకు కెప్టెన్ అభిరథ్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడు కేవలం 45 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 99 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయినప్పటికీ, జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. అభిరథ్తో పాటు మిగతా బ్యాటర్లలో షణ్ముఖ్18 బంతుల్లో 3 సిక్సర్లతో 30 పరుగులు చేయగా.. యశ్వీర్ గౌడ్ సైతం కేవలం 13 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 30* రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇక చివర్లో గడుగు గణేష్ కూడా 25* పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు.

►ALSO READ | కెప్టెన్సీకి ముందు శ్రేయస్ మాస్టర్ స్ట్రోక్.. హాట్ టాపిక్గా ఇన్‌స్టాగ్రామ్ బయో మార్పు!

అగ్రస్థానానికి హైదరాబాద్: 
ఈ సాలిడ్ బ్యాటింగ్ ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు కేవలం 18 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ని ఛేదించింది. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య, తనయ్, ఆర్యన్, అరుణ్‌లు తలో ఒక వికెట్ తీసినప్పటికీ తమ టీమ్ ని గెలిపించలేకపోయారు. ఈ అద్భుత విజయంతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో నెంబర్ స్థానానికి చేరుకుంది. 
 

©️ VIL Media Pvt Ltd.