Reading Time: 2 minutes

Singer Sunitha: ‘నా బాడీ నా ఇష్టం’ అంటే.. అవతలి ‘వాడి కళ్ళు వాడి ఇష్టం’.. సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్!

Caption of Image.

టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత (Singer Sunitha) తన మధురమైన గొంతుతోనే కాదు.. స్పష్టమైన, కుండబద్దలు కొట్టే ఆలోచనలతోనూ అందరినీ ఆకట్టుకుంటారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. లేటెస్ట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో మహిళల వస్త్రధారణ, సినిమా సామాజిక బాధ్యత, ఫెమినిజం పై చేసిన బోల్డ్ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

నా బాడీ నా ఇష్టం.. వాడి చూపు వాడి ఇష్టం..

ఇటీవల ట్రెండ్ అవుతున్న ‘మై బాడీ మై రైట్’ (My Body My Right) అనే స్లోగన్‌పై సునీత చాలా ప్రాక్టికల్ కోణంలో మాట్లాడారు. అమ్మాయిలు తమకు నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ, ‘నా బాడీ నా ఇష్టం’ అని బట్టలు వేసుకున్నప్పుడు, అవతలి వ్యక్తి చూసే చూపును కూడా ‘వాడి కళ్ళు వాడి ఇష్టం’ అనాల్సి వస్తుంది. ఇందులో ఎవరినీ తప్పు పట్టలేం అంటూ రియాలిటీని మాట్లాడారు. కేవలం బట్టల పరిధిని తగ్గించుకోవడమో, పెంచుకోవడమో, లేదా సిగరెట్లు తాగడమో స్వేచ్ఛ లేదా ఈక్వాలిటీ కాదని ఆమె స్పష్టం చేశారు.

ఫెమినిజం అది కాదు..

నా దృష్టిలో ఫెమినిజం అంటే సమానత్వం. ఒక ఇంట్లో గానీ, సమాజంలో గానీ ఒక మహిళ తన అభిప్రాయాన్ని చెప్తే.. దానికి పురుషులు ఎంతవరకు విలువ ఇస్తున్నారు అనే దానిపై పోరాడాలి. మహిళలను తక్కువ అంచనా వేయడాన్ని ప్రతిఘటించడమే నా ఫెమినిజం అని సునీత పేర్కొన్నారు. స్త్రీ, పురుషులు ఇద్దరూ విభిన్నమైన స్వభావం గలవారని, శారీరక బలం వేరైనా పురుషులు చేయలేని ఎన్నో పనులను మహిళలు చేయగలరని, ఇక్కడ కావాల్సింది పరస్పర గౌరవమని ఆమె అభిప్రాయపడ్డారు.

►ALSO READ | Bigg Boss Telugu 10: నాగార్జున గారు ‘ఒక్క ఛాన్స్’.. బిగ్ బాస్ కంట్లో పడబోయి.. డీజీపీ కంట్లో పడ్డ ఎస్సై.!

‘నో’ చెబితే అవకాశాలు రావు

సినిమా ఇండస్ట్రీ మహిళలకు పూర్తిగా సురక్షితమైన ప్రదేశం కాదని, తాను కేవలం 18 ఏళ్ల వయసులోనే అసౌకర్యకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని సునీత ఓపెన్ అయ్యారు. ఇండస్ట్రీలో ఒక మహిళ ‘నో’చెప్పడం అంత సులభం కాదన్నారు. అలా చెబితే అవకాశాలు రావడం చాలా అరుదని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు వచ్చిన అవకాశాలు నన్ను ఓ స్థాయిలో నిలబెట్టాయి. ఒకవేళ సింగర్‌గా అవకాశాలు రాకపోతే వెళ్లి వ్యవసాయం చేసుకుంటా కానీ నా ఆత్మగౌరవాన్ని వదులుకోను అంటూ సునీత ఇచ్చిన పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

©️ VIL Media Pvt Ltd.