
టీ 20 వరల్డ్ కప్ లో సెమీస్ ఆశలని భారత మహిళ జట్టు నిలబెట్టుకుంది. తాడేపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్ బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. బంగ్లాదేశ్ 137 పరుగులు టార్గెట్ ను ఐదు వికెట్లు కోల్పోయి ఈజీగా ఛేదించింది. ఓపెనర్ షఫాలీ వర్మ (53) హాఫ్ సెంచరీతో రాణించగా జెమీమా రోడ్రిగ్స్ (26) దూకుడు ఆటతో లక్ష్యాన్ని చేధించారు. ఈ విజయంతో సెమీస్ రేసులో నిలిచింది భారత్.
గురువారం మాంచెస్టర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్ షెఫాలీ వర్మ 53, యస్తికా భాటియా 23 పరుగుల సహకారంతో భారత్ 16.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది.
►ALSO READ | ఫోటో ఫీచర్: మెదక్ ఫాల్కన్స్ vs పాలమూరు స్ట్రైకర్స్