
పై ఫొటోలో మాస్క్ తో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోన్న స్టార్ హీరోను గుర్తు పట్టారా? ఊర మాస్ సినిమాలు చేయడంలో ఈ హీరో దిట్ట. అందుకే ఈ నటుడికి మాస్ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. అన్నట్లు ఈ స్టార్ హీరో భార్య కూడా స్టార్ హీరోయినే. చాలా మందికి ఆమె కలల రాణి అని చెప్పుకోవచ్చు. ఇక త్వరలోనే ఈ హీరో కూతురు కూడా హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశముంది. పేరుకు ఇతను బాలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయం. కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి ఒక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లో నటించాడు. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్ పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు అక్షయ్ దేవ్‌గణ్. ప్రముఖ దర్శక నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్ లో అతను నటిస్తోన్న లేటెస్ట్ సినిమా చౌహాన్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో అజయ్ దేవ్గన్ లుక్ చాలా ఇంటెన్స్‌గా, రగ్డ్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
కాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవ్ గణ్ ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇందులో అతను రామ్ చరణ్ తండ్రిగా కనిపించాడు. దీంతో పాటు అజయ్ నటించిన సింగం సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అయిన సంగతి తెలిసిందే. ఇక చౌహాన్ సినిమా విషయానికి వస్తే.. కశ్మీర్ పుల్వామా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. జియో స్టూడియోస్‌కు చెందిన జ్యోతి దేశ్‌పాండే, ఆనంద్ ఎల్ రాయ్ కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, హిమాన్షు శర్మ సంయుక్తంగా కలిసి భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నీరజ్ యాదవ్ ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు కథను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2027 అక్టోబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
చౌహాన్ టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.