Reading Time: < 1 minute

4 బంతుల్లో 3 క్యాచ్‌లు డ్రాప్.. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో భారత్ చెత్త ఫీల్డింగ్.. నెటిజన్లు ఫైర్!

Caption of Image.

Indian Womens Team Dropped Catches: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఫీల్డింగ్‌లో ఘోరంగా తడబడుతోంది. సెమీస్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఇండియన్ ఫీల్డర్లు వరుసగా క్యాచ్‌లు వదిలేస్తూ అభిమానులకు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నారు. 

4 బంతుల్లో 3 క్యాచ్‌లు డ్రాప్: 
మ్యాచ్ ప్రారంభంలోనే ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్.. బంగ్లాదేశ్ ఓపెనర్ దిలారా అక్తర్‌ను అవుట్ చేసి భారత్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. కానీ ఆ తర్వాతే అసలు కథ స్టార్ట్ అయింది. కేవలం మొదటి 5 ఓవర్లలోనే భారత ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్‌లను నేలపాలు చేశారు. ఇంకా దారుణం ఏంటంటే.. శ్రీచరణి వేసిన ఒకే ఓవర్‌లో కేవలం 4 బంతుల వ్యవధిలోనే 3 క్యాచ్‌లు డ్రాప్ చేసి బంగ్లా బ్యాటర్లకు లైఫ్ ఇచ్చారు. టోర్నీలో నిలవాలంటే ఇంతకంటే పతనం ఉండదంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇండియన్ ఫీల్డింగ్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు.

►ALSO READ | రంగారెడ్డి రైజర్స్‌ జోరుకు బ్రేక్.. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లాదేశ్: 
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నిగార్ సుల్తానా మొదట బ్యాటింగ్ తీసుకుంది. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయిన హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టుకు, సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా గెలవడం చాలా ముఖ్యం.. కానీ, గ్రౌండ్‌లో ఫీల్డర్ల ప్రదర్శన చూస్తుంటే మాత్రం పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే కనిపిస్తోంది. 

దీప్తి శర్మ రికార్డ్‌కు అడుగు దూరం: 
ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఒక అరుదైన మైలురాయికి చేరువలో ఉంది. ఆమె ఈ మ్యాచ్‌లో మరో వికెట్ తీస్తే.. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత లెజెండ్ ఝులన్ గోస్వామి (355 వికెట్లు) రికార్డును బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించనుంది. 

©️ VIL Media Pvt Ltd.