Reading Time: < 1 minute

విమాన ప్రమాదం జరిగితే రూ. 3 కోట్లు.. దేశంలోనే మొదటిసారి.. తెలంగాణ చారిత్రాత్మక ఒప్పందం

Caption of Image.

ప్రభుత్వ ఉద్యోగులకు  తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ . ఉద్యోగుల కుటుంబాలకు కొండంత భరోసా కల్పిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్  ప్రమాద బీమా పథకాన్ని లాంచ్ చేసింది.ఏకంగా 16 ప్రముఖ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుని.. ప్రభుత్వ ఉద్యోగులకు రూ. కోటిన్నర (1.5 Crore) భారీ ప్రమాద బీమాను అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే.. ఈ బీమా మొత్తం ఏకంగా రూ. 3 కోట్లకు పెరుగుతుంది. దేశంలోనే మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఈ తరహా బీమాను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించింది  తెలంగాణ సర్కార్.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత సర్కార్ హయాంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాక ఎంతగానో ఇబ్బంది పడ్డారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పులను కడుతూనే.. మేము అధికారంలోకి రాగానే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడేలా చేశాం అని స్పష్టం చేశారు.

ఈ పథకం కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాదు.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించడం విశేషం. ప్రతి ఉద్యోగి కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో పుట్టడమే ఒక అదృష్టం అనే భావన కలిగేలా మా పాలన సాగుతుందన్నారు.

►ALSO READ | పాస్ పోర్టు పౌరసత్వం వివాదంలో..ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా.. రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ బీమా’ కల్పిస్తున్నామని.. త్వరలోనే ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డ్ అందించి ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

©️ VIL Media Pvt Ltd.