Reading Time: 2 minutes
Jabardasth Faima: సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ఫైమా.. తాళి కట్టే వేళ కన్నీటిపర్యంతం.. వీడియో

జబర్దస్త్ కమెడియన్ ఫైమా మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. బుధవారం (జూన్ 24) తన బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ నాయక్‌ ను ఆమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ రిజిస్టర్ ఆఫీస్ లో పూల దండలు మార్చుకుని ఒకటయ్యారీ లవ్ బర్డ్స్. అనంతరం తన పెళ్లికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలోనూ షేర్ చేసింది ఫైమా. తొమ్మిదేళ్ల ప్రేమ, ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొని ఫైనల్ గా ఒక్కటయ్యామంటూ ఎమోషనల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు బుల్లితెర ప్రముఖులు, సినీ తారలు, అభిమానులు ఫైమాకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఇప్పుడు రెండోసారి పెళ్లి చేసుకుంది ఫైమా. సంప్రదాయబద్ధంగా ప్రవీణ్ నాయక్ తో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు వీరి హల్దీ వేడుక కూడా ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది ఫైమా.

కాగా ప్రధాన ఘట్టంలో భాగంగా ప్రవీణ్ ఫైమా మెడలో మూడు ముళ్లు వేస్తుండగా ఆమె తన భావోద్వేగాలను అస్సలు ఆపుకోలేకపోయింది. తొమ్మిదేళ్ల నిరీక్షణ, పడ్డ కష్టాలన్నీ కళ్లముందు కదలాడటంతో ఫైమా కన్నీటి పర్యంతమైంది. ఇక ప్రవీణ్ కూడా ఏడుస్తున్న భార్య కన్నీళ్లు తుడుస్తూ ఆమెను ఓదార్చాడు. ప్రస్తుతం ఫైమా పెళ్లి ఫొటోలు, వీడియోలు నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. వీటిని చూసిన పలువురు జబర్దస్త్ కమెడియన్లు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు, టాలీవుడ్ స్టార్స్ ఫైమాకు పెద్ద ఎత్తున అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఫైమా పెళ్లి వీడియోలు, ఫొటోలు ఇవిగో..

 

View this post on Instagram

 

A post shared by FAIMA (@faima_patas)

ఇక ఫైమా విషయానికి వస్తే.. పటాస్ షోతో కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సందర్భానికి తగ్గట్టుగా తనదైన బాడీ లాంగ్వేజ్ తో ఆమె వేసే కామెడీ పంచులు , ప్రాసలకు బుల్లితెర ఆడియెన్స్ కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ పాల్గొంది ఫైమా. విజేతగా నిలవకున్నా తన ఆట, మాట తీరుతో  బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెల్చుకుంది.

భర్త ప్రవీణ్ నాయక్ తో ఫైమా..

 

View this post on Instagram

 

A post shared by @kranthi_.lucky

 

View this post on Instagram

 

A post shared by @kranthi_.lucky

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.