Reading Time: 2 minutes

కెప్టెన్సీకి ముందు శ్రేయస్ మాస్టర్ స్ట్రోక్.. హాట్ టాపిక్గా ఇన్‌స్టాగ్రామ్ బయో మార్పు!

Caption of Image.

Shreyas Iyer Changes Instagram Bio: ఐర్లాండ్‌తో జరగబోయే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న శ్రేయస్ అయ్యర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఈ సిరీస్‌కు ముందు అతను తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బయోను (Instagram Bio) మార్చడం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన జీవితంలో రెండో పుట్టిన తేదీ (Second Birthday) అంటూ ఒక ప్రత్యేకమైన డేట్‌ను అందులో మెన్షన్ చేయడం అందరిని ఆకర్షిస్తోంది.

శ్రేయస్ అయ్యర్ రెండో పుట్టిన తేదీ: 
నిజానికి శ్రేయస్ అయ్యర్ 1994 డిసెంబర్ 6వ తేదీన జన్మించాడు. కానీ, తన క్రికెట్ కెరీర్ పరంగా గత ఏడాది డిసెంబర్ 25న (25.12.2025) తనకు రెండో లైఫ్ (రెండో పుట్టిన రోజు) వచ్చినట్లు అయ్యర్ తన బయోలో రాసుకొచ్చాడు. తీవ్రమైన గాయం నుంచి కోలుకుని, మళ్లీ బ్యాట్ పట్టిన ఆ రోజును తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైనదిగా అతను భావిస్తున్నాడు. దీంతో అయ్యర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మద్దతు ఇస్తున్నారు. 

►ALSO READ | RCBకి బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు అందించిన పాటిదార్.. రజత్ స్థానంలో కొత్త కెప్టెన్ అతడే?  

ఫ్యాన్స్ ఎమోషనల్:  
శ్రేయస్ అయ్యర్ కంబ్యాక్ గురించి ఒక అభిమాని సోషల్ మీడియాలో రాసుకొచ్చిన ఎమోషనల్ పోస్ట్ కూడా ఈ ఇమేజ్‌లో హైలైట్‌గా నిలిచింది. అయ్యర్ 25.12.2025 నాడు గాయం నుంచి కోలుకుని మళ్లీ బ్యాట్‌ను పట్టుకోవడం, ఆ సమయంలో అతను ప్రాణం పోయే పరిస్థితి నుంచి బయటపడ్డాడు.. కాబట్టి ఇది కేవలం క్రికెట్‌లోకి అతను పునరాగమనం (Comeback) చేసిన రోజు మాత్రమే కాదు.. తన జీవితంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన రోజు అని పేర్కొన్నాడు.. అందుకే అతడికి ఈ డేట్ చాలా స్పెషల్.. అక్కడి నుంచే తన ప్రయాణాన్ని ఫ్రెష్‌గా స్టార్ట్ చేసి, చాలా కష్టపడి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడని తెలిపాడు. 

 

 

©️ VIL Media Pvt Ltd.