Reading Time: < 1 minute
TGCET 2026 Results: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల తొలి జాబితా ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్, ఏప్రిల్‌ 7: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన TGCET 2026 ఫేజ్-1 ఫలితాలను సంక్షేమశాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మంగళవారం సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి VI నుంచి IX తరగతుల వరకు బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీతో పాటు TGTWREIS స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పరిగి (బాలికలు), ఖమ్మం (బాలురు)లో VIII తరగతి ప్రవేశాలకు ఈ ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల TGCET 2026 తొలి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫిబ్రవరి 22న రాష్ట్రవ్యాప్తంగా 492 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 1,02,960 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫేజ్-1లో మొత్తం 6,242 సీట్లు భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఏప్రిల్‌ 7 నుండి 20 వరకు తమకు కేటాయించిన పాఠశాలల్లో ధృవపత్రాలు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరుకావాలని మంత్రి అడ్లురి సూచించారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… విద్యార్థుల అడ్మిషన్ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

దళిత, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాలనే సంకల్పంతో రేవంత్‌ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయి విద్య, డిజిటల్ క్లాస్‌రూమ్స్, పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమతుల్య ఆహారం, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు, క్రీడా సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికితీసేలా మెంటరింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తును బలపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల TGCET 2026 తొలి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.