
తనను సార్ అని పిలవడం కంటే అన్నా అని పిలిస్తేనే ఎనలేని సంతోషమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. . మీ అందరితో కలిసి నడిస్తేనే కదా ప్రజాసేవ సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా కల్పిస్తూ 16 ప్రముఖ బ్యాంకులతో చారిత్రాత్మక ప్రమాద బీమా ఒప్పందాన్ని కుదుర్చుకుంది ప్రభుత్వం.
ఈ సందర్భంగా ర సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తనను విమర్శించే ప్రత్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అవును.. నేను గుంపు మేస్త్రినే అంటూ గర్వంగా ప్రకటించారు. నన్ను చాలా మంది గుంపు మేస్త్రి అంటూ అవహేళన చేస్తారు. అవును.. నేను గుంపు మేస్త్రినే ఎందుకంటే… నా ఉద్యోగులు, నా ప్రజలే నా గుంపు. పేద ప్రజల కష్టాలను తీర్చే నిజమైన వారధులు మీరే కదా? కొంతమంది దొరలమని గొప్పలు చెప్పుకుంటారు… నాకు అలాంటి గొప్పలు అవసరం లేదన్నారు.
►ALSO READ | ఉద్యోగులకు కోటిన్నర బీమా..అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, పెన్షనర్లకూ వర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి
పదవుల కంటే ప్రజల ప్రేమే ముఖ్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాటి జడ్పీటీసీ ప్రస్థానం నుండి నేటి సీఎం కుర్చీ వరకు తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఒకప్పుడు నేను జడ్పీటీసీని, ఆ తర్వాత ఎంపీని.. ఇప్పుడు సీఎంని. కానీ, నేను సీఎం కాకముందు ఎలా ఉన్నానో… ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. పదవులు ఎప్పుడూ శాశ్వతం కాదు… ప్రజల గుండెల్లో ఉండే స్థానమే శాశ్వతం. దొరతనం కాదన్నారు రేవంత్.