
ప్రముఖ ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది. యాపిల్ టీవీలు, ల్యాప్ టాప్ లు, ఐప్యాడ్ ల ధరలు భారీగా పెరిగాయి. భారత్ తో పాటు ప్రపంచదేశాల్లో యాపిల్ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయి. MacBookలు, iPadలు, Apple TV వంటి ప్రాడక్టుల ధరలు దాదాపు 60వేలకు పైగా పెంచి వినియోగదారులకు షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా RAM కొరత టెక్నాలజీ రంగంపై తీవ్ర ప్రభావంతో యాపిల్ ధరలు హైక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఐఫోన్ల ధరలు పెంచలేదు.
కొత్త ధరల ప్రకారం..ల్యాప్ టాప్ MacBook Air (512GB) ధర రూ.1లక్షా19వేల900 నుంచి రూ.1లక్షాల37వేల900కు పెరిగింది. ఎంట్రీ-లెవల్ ల్యాప్ టాప్ MacBook Neo ధర రూ.69వేల900 నుంచి రూ.79వేల900కు చేరింది. M5 చిప్‌తో కూడిన 15-అంగుళాల ల్యాప్ టాప్ MacBook Air ధర రూ.1లక్షా44వేల900 నుంచి రూ.1లక్షా79వేల900కు పెరిగింది. ఇక 14-అంగుళాల MacBook Pro ల్యాప్ టాప్ (M5, 16GB RAM) ధర అత్యధికంగా పెరిగి రూ.1లక్షా69వేల900 నుంచి రూ.2లక్షల39వేల900కు చేరింది.
మరోవైపు ఐప్యాడ్ (iPad )విభాగంలో కూడా ధరలు భారీగా పెరిగాయి. 11-అంగుళాల ఐప్యాడ్ iPad Air (M4) ధర రూ.64వేల900 నుంచి రూ.89వేల900కు పెరగగా, ఐప్యాడ్ Pro (M5, 256GB) ధర రూ.99వేల990 నుంచి రూ.1లక్షాల39వేల900కు చేరింది.
►ALSO READ | సైబర్ మోస బాధితులకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్: రూ.25వేల వరకు పరిహారం
ఇక హోం ఎంటర్ టైన్ మెంట్ ప్రాడక్టులైన Apple TV, HomePod ధరలు కూడా పెరిగాయి. Apple TV 4K (64GB) ధర రూ.14వేల900 నుంచి రూ.25వేల900కు పెరిగింది. 128GB వేరియంట్ ధర రూ.16వేల900 నుంచి రూ.31వేల900కు చేరింది. HomePod ధర రూ.32వేల900 నుంచి రూ.44వేల900కు, HomePod Mini ధర రూ.10వేల900 నుంచి రూ.15వేల900కు పెరిగింది.
RAM, NAND Storage వంటి కీలక చిప్‌ల కొరత కారణంగా ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో ఈ ధరలు పెంచినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆపిల్ వంటి దిగ్గజ సంస్థే ధరలు పెంచడంతో, రాబోయే రోజుల్లో ఇతర ల్యాప్‌టాప్, టాబ్లెట్, స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కూడా ధరలు పెంచే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
MacBook ధరల ఇలా ఉన్నాయి.
MacBook ప్రస్తుత ధర పెరిగిన ధర
MacBook Neo 256 GB: రూ.69వేల990 రూ.79వేల990
13 ఇంచెస్ MacBook Air M5: రూ.1లక్షా19వేల900 రూ.1లక్షాల 49వేల900
15ఇంచెస్ MacBook Air M5: రూ.1లక్షా 44వేల900 రూ.1లక్షా79వేల900
14ఇంచెస్ MacBook Pro M5: రూ.1లక్షా89వేల900 నుంచి రూ.2లక్షా39వేల900
16ఇంచెస్ MacBook Pro M5 Pro: రూ.2లక్షల 99వేల900 రూ.3లక్షల59వేల900
Apple TV 4K ధరలు.. రూ.14వేల900 రూ.25వేల900లు
పెరిగిన iPad ధరలు
iPad పాత ధర కొత్త ధర
11th Gen iPad 128 GB WiFi: రూ.34వేల900 రూ.49వేల900
iPad mini: రూ. 49వేల900 రూ. 69వేల900లకు
11″ iPad Air M4 : రూ.64వేల900 రూ. 89వేల 900
13″ iPad Air M4: రూ.89వేల900 1లక్షా19వేల900
11″ iPad Pro M5: రూ.99వేల990 రూ.1లక్షా39వేల900
13″ iPad Pro M5: రూ.1లక్షా29వేల900 రూ.1లక్షా99వేలు