
తన మధురమైన గొంతుతో.. ‘సరిగమప’ విన్నర్ అయిన యశస్వి కొండేపూడి ఆ షో కారణంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులోనూ ‘జాను’ సినిమాలోని “లైఫ్ ఆఫ్ రామ్” పాటను తన గాత్రంతో అందరికీ వినిపించి అందర్నీ ఫిదా చేశాడు. ఆ ఒక్క సాంగ్‌తో విపరీతంగా పాపులర్ అయ్యాడు. ఈక్రమంలోనే ఓ ఈవెంట్ వేదికగా .. జానుతో తన ప్రేమకథను పబ్లిక్‌గా వెల్లడించి హాట్ టాపిక్ అయ్యాడు. ఆ తర్వాత జానుతో బ్రేకప్ యశస్వి బ్రేకప్ జరిగిందనే న్యూస్‌తోనూ వైరల్ టాపిక్ గా మారాడు. ఇప్పుడు కట్ చేస్తే తన ఫ్యాన్స్‌తో్ పాటే నెటిజన్లకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చాడు.ఇప్పుడు జాను మీద కంపోజ్ చేసిన బ్రేకప్ సాంగ్‌తో మరో సారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు ఈ సింగర్. తమ లవ్ స్టోరీ ఇంకా మిగిలే ఉందంటూ తన న్యూ సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేసి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఏడో తరగతి నుంచే తాను జాను ప్రమించుకుంటున్నామని గతంలో ఓ షోలో చెప్పాడు యశస్వి. అంతేకాదు జాను కోసం 7 స్కూళ్లు మారానని.. తన కోసమే ఇష్టం లేకున్నా బైపీసీ తీసుకున్నా అంటూ చెప్పాడు. తమ ప్రేమ విషయం ఇంట్లో ముందే తెలుసని.. ఇక పెళ్లే చేసుకోవడమే ఆలస్యం అంటూ.. సంబరపడిపోయాడు. కానీ కట్ చేస్తే ఇప్పుడు జానుతో యశస్వితో బ్రేకప్ చేసుకుందనే న్యూస్ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ న్యూస్‌కు బలం చేకూరేలా.. వీరిద్దరూ వారి వారి ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒకరినొకరి ఫోటోలను డిలీట్ చేశారు. తమ బ్రేకప్ న్యూస్‌ను ఇన్‌డైరెక్ట్‌గా కన్ఫర్మ్ చేశారు. ఈ క్రమంలోనే యశస్వి తన న్యూస్ సాంగ్ చెంచెల టీజర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. తన లవ్ స్టోరీ ఇంకా బతికే ఉందని ఆసాంగ్‌లో చెబుతున్నాడు. “చెంచెల” మోషన్ పోస్టర్‌లో యశస్వి కొండేపూడి మరియు శ్రీ ఝాన్సీ అలియాస్ జాను చాలా కాలం తర్వాత మళ్లీ స్క్రీన్ మీద కలిసి కనిపిస్తున్నారు. “అసంపూర్ణంగా మిగిలిపోయిన కథను మళ్లీ మొదలుపెడుతున్నాం” అనే అర్థం వచ్చేలా ఈ సాంగ్ ప్రమోషన్స్ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. చెంచెల సాంగ్ టీజర్‌లో యశస్వి, జానుల మధ్య ఉన్న ప్రేమ, ఎమోషన్ అండ్ కనెక్షన్‌ను హైలైట్ చేశారు. ఇది ఒక ప్యూర్ రొమాంటిక్ మెలోడీగా రూపొందించినట్టు కనిపిస్తోంది. ఇక సాంగ్ ను యశస్వి స్వయంగా కంపోజ్ చేసి మేల్ వెర్షన్ తనే పాడగా, రమ్య బెహరా ఫిమేల్ వెర్షన్ పాడారు. జాను అలియాస్ శ్రీ ఝాన్సీ ఈ పాటలో యశస్వితో లీడ్ చేయడమే కాకుండా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా వ్యవహరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Biker Collection: బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడిస్తున్న బైకర్
Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట
Demon Pavan: నన్ను రాక్షసుడిగా మార్చొద్దు.. ట్రోలర్స్‌కు హెచ్చరిక
Hyper Aadi: పబ్లిక్‌లో గొడవకు దిగిన.. హైపర్ ఆది
Bombai Ki Ranu: ‘బొంబాయికి రాను’ యూట్యూబ్‌లో అరుదైర రికార్డ్