
హైదరాబాద్, జూలై 2: సివిల్ సర్వీసెస్‌లో కెరీర్‌ను లక్ష్యంగా పెట్టుకున్న మహిళా అభ్యర్థులకు హైదరాబాద్‌లోని జీఆర్ ఐఏఎస్ అకాడమీ తీపికబురు చెప్పింది. మహిళల కోసం ప్రత్యేకంగా GR SET-2026 (Scholarship Eligibility Test) పేరుతో స్కాలర్‌షిప్ అర్హత పరీక్షను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన మహిళా అభ్యర్థులకు ఏడాది పాటు పూర్తిగా ఉచితంగా యూపీఎస్సీ కోచింగ్‌తో పాటు మెంటార్‌షిప్ అందించనుంది. అకాడమీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎంపికైన అభ్యర్థులకు సుమారు రూ.1.45 లక్షల విలువైన ఒక సంవత్సరం ఆఫ్‌లైన్ యూపీఎస్సీ కోచింగ్, మెంటార్‌షిప్ కార్యక్రమాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తారు. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసే టాప్ 40 మహిళా అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించనున్నారు.
ఎంపిక ప్రక్రియ ఇలా..
అభ్యర్థులకు పరీక్షకు 10 రోజుల ముందు ప్రత్యేకంగా రూపొందించిన 50 పేజీల స్టడీ బుక్‌లెట్‌ను అందజేస్తారు. స్కాలర్‌షిప్ అర్హత పరీక్షలో వచ్చే అన్ని ప్రశ్నలు ఈ బుక్‌లెట్‌లోని అంశాల నుంచే ఉంటాయి. దీంతో యూపీఎస్సీపై ముందస్తు అవగాహన లేకపోయినా, కొత్తగా సన్నద్ధమవుతున్న అభ్యర్థులు కూడా సమాన అవకాశంతో పోటీ పడవచ్చని అకాడమీ తెలిపింది. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా టాప్ 40 మంది అభ్యర్థులను ఎంపిక చేసి హైదరాబాద్‌లో నిర్వహించే సమగ్ర ఆఫ్‌లైన్ యూపీఎస్సీ కోచింగ్ బ్యాచ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర సామాజిక కారణాల వల్ల యూపీఎస్సీ లక్ష్యాన్ని వదులుకోవాల్సి వస్తున్న మహిళలకు ఈ స్కాలర్‌షిప్ మంచి అవకాశంగా నిలుస్తుందని జీఆర్ ఐఏఎస్ అకాడమీ పేర్కొంది. దేశ భవిష్యత్ మహిళా పరిపాలనా నాయకులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు, డిగ్రీ పూర్తిచేసిన మహిళా అభ్యర్థులు, ఉద్యోగ అనుభవం ఉన్న మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు గురువారం (జులై 2, 2026) చివరి తేదీ. మరికొన్ని గంటల వరకు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నమాట. స్కాలర్‌షిప్ పరీక్ష జూన్ 7, 2026న నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు ఫోన్: 90633 45568 లేదా అధికారిక వెబ్‌సైట్ www.griasacademy.comను సందర్శించండి.
పరీక్షా కేంద్రం
GR IAS Academy, పిల్లర్ నెం. 41, అశోక్‌నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ సమీపంలో, హైదరాబాద్.