Reading Time: 2 minutes

వైభవ్ డెబ్యూపై శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు.. భారత జట్టులో చోటు దక్కేనా?

Caption of Image.

Vaibhav Sooryavanshi: ఇంగ్లాండ్‌తో నేటి (జూలై 1) నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు.. భారత యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం (Debut) పై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐర్లాండ్ సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన ఈ యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌కు.. ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌లోనే ఛాన్స్ దక్కుతుందా లేదా అనే విషయంపై అయ్యర్ సస్పెన్స్ మెయింటైన్ చేశాడు.

మా చేతులు కట్టేసి ఉన్నాయి: శ్రేయస్
మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ ప్రతిభను కొనియాడుతూనే ప్లేయింగ్ XI లీక్ చేయడానికి నిరాకరించాడు. మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి.. ఇవి జట్టు గోప్యతకు సంబంధించిన విషయాలు.. మేము ఏ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామో ఇప్పుడే అందరికీ చెప్పలేం, ఎందుకంటే అది ప్రత్యర్థి జట్టుకు వ్యూహాలు మార్చుకునే ఛాన్స్ ఇస్తుంది. వైభవ్ అద్భుతమైన ప్రతిభావంతుడు .. అతనికి ఎప్పుడు అవకాశం వచ్చినా ఖచ్చితంగా అదరగొడతాడని అయ్యర్ చెప్పుకొచ్చాడు. 

విధ్వంసకర బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా వైభవ్: 
ఐపీఎల్ 2026 లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు.. ఈ మెగా టోర్నీ ద్వారానే అతను జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కేవలం 16 ఇన్నింగ్స్‌ల్లోనే ఏకంగా 776 రన్స్ సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు, సీజన్‌లో అత్యధికంగా 72 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు. అలాగే ఇంగ్లాండ్ చేరడానికి ముందు లంక ఏ జట్టుతో జరిగిన ట్రై-సిరీస్ ఫైనల్లో కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు సత్తా చాటారు.  

ఛాన్స్ ఇవ్వాలనే యోచనలో మేనేజ్‌మెంట్: 
ఐర్లాండ్ సిరీస్‌లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఆశించిన స్థాయిలో రాణించలేదు.. ముఖ్యంగా సంజు రెండు మ్యాచ్‌ల్లోనూ ఫస్ట్ బాల్‌కే (గోల్డెన్ డక్) అవుటై నిరాశపరిచాడు. అయినప్పటికీ, 2026 టీ20 వరల్డ్ కప్ చివరి 3 మ్యాచ్‌ల్లో వరుస హాఫ్ సెంచరీలతో భారత్‌ను గెలిపించిన ట్రాక్ రికార్డు ఉండటంతో శాంసన్‌కు మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని జట్టు భావిస్తోంది. అభిషేక్ శర్మ కూడా ఒక మ్యాచ్‌లో 20 బంతుల్లోనే 49 రన్స్ కొట్టినా, మరో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. వీరిద్దరికీ మరికొంత సమయం ఇవ్వాలనుకుంటే మాత్రం.. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ తన డెబ్యూ కోసం మరికొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదని పేర్కొన్నారు. 

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ షెడ్యూల్:

టీ20 సిరీస్: 
* 1వ టీ20: జూలై 1
* 2వ టీ20: జూలై 4
* 3వ టీ20: జూలై 7
* 4వ టీ20: జూలై 9
* 5వ టీ20: జూలై 11

వన్డే సిరీస్:

* 1వ వన్డే: జూలై 14
* 2వ వన్డే: జూలై 16
* 3వ వన్డే: జూలై 19

©️ VIL Media Pvt Ltd.