Reading Time: < 1 minute

అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ అప్లికేషన్లు షురూ

Caption of Image.
  • నేటి నుంచి ఆగస్ట్ 31 వరకు గడువు

హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రభుత్వం ఇస్తున్న అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్లై చేసుకునేందుకు ఎస్సీ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన ఎస్సీ స్టూడెంట్స్ ఈ పాస్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుధవారం నుంచి ఆగస్ట్ 31వరకు అప్లై చేసుకోవాలని ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్ విజయేంద్ర బోయి మంగళవారం పత్రిక ప్రకటనలో కోరారు.

ప్రతి ఏటా 500 మంది ఎస్సీ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విదేశాల్లో ఉన్నత విద్య కోసం రూ.20 లక్షల స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం రెండు వాయిదాల్లో చెల్లిస్తోంది. ఈ స్కీమ్ అర్హతలు, ఇతర వివరాలు ఈ పాస్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉన్నాయని కమిషనర్ పేర్కొన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా పేద ఎస్సీ స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. 

©️ VIL Media Pvt Ltd.