Reading Time: 3 minutes

నీ కష్టం, నీ త్యాగం.. నీ ఫ్యామిలీ, ఈ సొసైటీ దృష్టిలో ఎంత..? కన్నీళ్లు తెప్పించే సాఫ్ట్వేర్ కోటీశ్వరుడి జీవిత గాథ !

Caption of Image.

బెంగళూరు నగరం ఉదయం 6 గంటలు. సిటీ ఇంకా నిద్రలేవనే లేదు.. రోడ్లపైకి వెహికిల్స్ అప్పుడప్పుడే వస్తున్నాయి. ఆ టైమ్ లో లేయాఫ్ మెసేజ్ వచ్చింది ఒక వ్యక్తికి.  ఐఐటీ బాంబేలో చదివిన వ్యక్తి..అమెరికాలో 17 ఏళ్లు పని చేసి.. కోట్లు సంపాదించాడు. సొంత డబ్బుతో బెంగళూరులోనే అద్భుతమైన లగ్జరీ ఫ్లాట్ కట్టాడు. భార్య, కొడుకు కోసం జీవితం అంతా కష్టపడ్డాడు. రాత్రి నిద్రలు తగ్గి, ఫ్యామిలీని కోల్పోతున్నానని తెలిసినా, వాళ్ల కోసమే కదా లైఫ్ అని సర్దుకున్నాడు. 

కానీ అలాంటి వ్యక్తికి ఫ్యామిలీలో దొరికిన రెస్పెక్ట్.. గౌరవం ఎలా ఉందో చూడండి. నువ్వు ఎంత సంపాదించినా.. ఎంత సక్సెస్ ఫుల్ పర్సన్ అయినా..  ఫ్యామిలీ మెంబర్స్, వారసులు, సొసైటీ దృష్టిలో ఒక బ్రెడ్ విన్నర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ స్టోరీ చదివితే పిచ్చ క్లారిటీ వస్తుంది. గుండె కరిగిపోతుంది అనే కంటే కన్నీళ్లు తెప్పించే స్టోరీ అని చెప్పడం కరెక్టేమో.

ఒక ఐటీ కంపెనీ 12 వేల మంది లేఅఫ్ లిస్టులో అతని పేరు కూడా ఉండటం షాకింగ్ కు గురిచేసింది. అయినా భయపడేదేంటి.. ఇల్లు కట్టుకున్నా.. ఆస్తి కూడబెట్టినా.. సొసైటీలో టాప్ పొజిషన్ లో ఉన్న.. మళ్లీ ఏదైనా కంపెనీలో చాన్స్ వచ్చేవరకు ఎదురు చూద్దాం.. అని అనుకున్నాడు పాపం. కానీ అతని అభిప్రాయాలు.. ఆలోచనలు ఎవరికి పట్టినట్లు. ఆయన ఫ్యామిలీకి ఒక డబ్బు సంపాదించే మెషిన్ మాత్రమే. తనను ఒక యంత్రంలా చూస్తున్నారని తెలిసే రోజు రానే వచ్చింది. 

కొడుకు మాటలతో హార్ట్ బ్రేక్..

కొడుకు సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తాడు. ఆరోజు అన్నీ మర్చిపోయి సరదాగా కొడుకుతో గడుపుదాం అనుకున్నాడు. వీడియో గేమ్ ఆడదామా? అని అని అడిగాడు.  కొడుకు ఇచ్చిన రిప్లైకి దాదాపు ఆయన గుండె పగిలిందనే చెప్పాలి.  నాన్న, నాకు రోజు సరిపడినంత పని ఉంది. స్కూల్, హోమ్‌వర్క్… నేను మీలాగా ఖాళీగా కూర్చోలేదు అంటూ వెళ్లిపోయాడు.  ఆ మాటలు గుండెలో బాంబులు పేల్చినంత బాధించాయి పాపం ఆ తండ్రిని.  కానీ అతడు నవ్వేశాడు. తన కొడుకు ముందు బలహీనుడిగా కనిపించాలని అనిపించలేదు.

చంపినంత పనిచేసిన భార్య:

కొడుకు అంటే బాధ్యతలు, కష్టాలు తెలియవు. కనీసం భార్య అయిన.. తన అర్థాంగి అర్థం చేసుకుంటుంది కదా అనుకున్నాడు పాపం. కానీ ఆమె చెప్పిన సలహాతో దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది ఆ తండ్రికి. మన 8వ ఫ్లోర్‌లో ఉన్న 32 ఏళ్ల వ్యక్తి స్టార్టప్ మొదలుపెట్టాడు. నువ్వు వెళ్లి అతని దగ్గర ఏదైనా జాబ్ చేయి. ఇంట్లో కూర్చుని ప్లంబింగ్ ఎందుకు పాడు చేస్తున్నావ్? ఎంతో కొంత.. ఎంతిచ్చినా ఎక్కువ అంచనా పెట్టుకోకుండా పనిచేయండి.. అని అనేసింది. 

కోట్లు సంపాదించిన వ్యక్తి, అమెరికాలో రాక్‌స్టార్ లాంటి కెరీర్ అనుభవించిన మనిషి.. కుటంబం కొన్ని తరాలు కూర్చున్నా తరగని ఆస్తి సంపాదించిన వ్యక్తి ఇలాంటి గుండె పగిలే మాటలు వినాల్సి వచ్చింది.  అతని కళ్లు నిండిపోయాయి. కానీ కన్నీరు పడనివ్వలేదు. అవును… చూస్తా అని మాత్రమే అన్నాడు.

వేధించే సమాజం: 

ఫ్యామిలీకి తన త్యాగం అర్థం కాలేదు. కానీ సొసైటీకి ఫ్యామిలీ కోసం తను పడే తపన.. తను సాధించిన సక్సెస్ అర్థమయ్యే ఉంటుందని అనుకున్నాడు. కానీ వాళ్లు వేధిస్తారని కలలో కూడా అనుకోలేదు ఆ తండ్రి. ఏంటి సార్, బ్రేక్ పడిందా? ఇప్పుడు కిరాణా షాపు పెట్టండి. మంచి బిజినెస్. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలిక కదా అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు ఇరుగు పొరుగు వారు. అతడు నవ్వేశాడు. కానీ ఆ నవ్వు లోపల ఏడుపుగా మారిపోయింది.

ALSO READ : గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ గా నలుగురు ఇండియన్ అమెరికన్లు..

రాత్రి పడుకున్నప్పుడు అతడు తనను తాను అడుగుకున్నాడు. నేను ఎందుకు ఇంత కష్టపడ్డాను? ఈ ఇల్లు ఎవరి కోసం కట్టాను? ఈ కార్లు, ఈ ఫ్లాట్… ఇవన్నీ ఎవరి కోసం? అంటూ రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచిస్తూ కూర్చున్నాడు.  

ఉద్యోగం చేస్తూ చనిపోవడమే బెటర్.. 

ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ అతని గౌరవం ఒక్కొక్క శాతం తగ్గిపోతోంది. కుటుంబం నుంచి రెస్పెక్ట్ లేదు. బయట వాళ్ల నుంచి సానుభూతి లేదు. ఎవరికీ అతని 18 ఏళ్ల కష్టం కనిపించడం లేదు. కేవలం ఉద్యోగం పోయిన వాడుగా మాత్రమే చూస్తున్నారు.

దీంతో సందీప్ అనే యూట్యూబర్ కు షేర్ చేసుకున్న విషయం ఏంటో తెలుసా..? సందీప్… నేను ఇలాగే కంపెనీలో పని చేస్తూ చేస్తూ ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే అదే మంచిదేమో. ఎందుకంటే ప్రతి రోజు కనీసం ఒక శాతం గౌరవం లేకుండా వీళ్ల మధ్య చనిపోవడం కరెక్ట్ కాదేమో. నా ఫ్యామిలీ నాకు ఒక్క శాతం కూడా రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ఆ మాటలు విన్నప్పుడు ఎవరికైనా గుండె బరువెక్కుతుంది కాదు.. కన్నీళ్లు ఆగవు అని అనటం కరెక్టేమో. ఇది కేవలం ఒక లేఅఫ్ స్టోరీ కాదు. ఇది ఒక తండ్రి హృదయ వేదన.
ఒక భర్త ఆత్మగౌరవం.

ఒక మనిషి కలల సౌధాలను నిర్మించుకుని.. వాటిని సాధించి ఇంతకు మించి ఏ వ్యక్తి అయినా ఫ్యామిలీ కోసం చేయగలడా అనుకున్న ఆ తండ్రికి.. నువ్వు జీరో.. ఏంటి నువ్వు చేసింది.. అన్నట్లుగా ఫ్యామిలీ ట్రీట్ చేసే విధానం ఎంత నరకమో మాటల్లో చెప్పలేనిది. 

ఎంత మంది ఇలాంటి ఫ్లాట్లలో, ఇలాంటి నిశ్శబ్ద రాత్రుల్లో తమ జీవితాలను ప్రశ్నిస్తున్నారో… ఎవరికి తెలుసు? గౌరవం డబ్బుతో కొనుక్కోలేమని, కానీ దాన్ని కోల్పోవడం ఎంత బాధాకరమో ఆ రాత్రి ఆ తండ్రికి అర్థమైంది. జీవితం ఎంతో కష్టపడి సాధించిన వాటిని ఒక్కసారి కోల్పోతే… మనకు మిగిలేది కేవలం గుండెలో మిగిలిన శూన్యం మాత్రమేనని ఈ సందర్భంగా చెప్పడం సముచితం అనుకుంటా. 
 

©️ VIL Media Pvt Ltd.