Reading Time: < 1 minute

యాదాద్రి: 735 కిలోల గంజాయి దహనం

Caption of Image.

యాదాద్రి, వెలుగు:  వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఎండు గంజాయిని రైల్వే పోలీసులు మంగళవారం దహనం చేశారు. గంజాయి రవాణా అరికట్టే క్రమంలో సికింద్రాబాద్​ డివిజన్​ పరిధిలోని రైల్వే పోలీసులు మూడేండ్లుగా స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించారు. ఈ స్పెషల్​ డ్రైవ్​లో 51 కేసుల్లో మొత్తం 735 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ రూ. 3.22 కోట్ల ఉంటుంది. 

సికింద్రాబాద్​ అర్బన్​ పరిధిలో 33 కేసుల్లో 450 కిలోలు, రూరల్​ పరిధిలో 2 కేసుల్లో 224 కిలోలు, కాజీపేట పరిధిలో 16 కేసుల్లో 223 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురంలోని ఓ ఇండస్ట్రీలోని బ్రాయిలర్​లో దహనం చేశారు.  రైల్వే డిస్ట్రిక్ట్ సికింద్రాబాద్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ గోనె సందీప్ కుమార్ ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.