Reading Time: < 1 minute

తిక్క కుదిరింది వెధవకి : తాగుబోతు భర్తను కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసిన భార్య

Caption of Image.

ఇగో గీ అక్కను చూసిన్రా.. తాగుబోతు మొగుడు రోజు తాగొచ్చి ఇజ్జత్ తీస్తుండని ఏం చేసిందో చూడుర్రి. తాగొచ్చి రచ్చ రచ్చ చేస్తున్న మొగుడి రిమ్మ ఇచ్చుకొని తిక్క వదిలేలా తాళ్లతో స్తంభానికి కట్టేసింది..నోటికి ప్లాస్టరేసి నోరు మూయించింది. ఇగ అక్కడున్నోళ్లు..తాగుబోతు  తందనాలు, అయ్యగారికి పెళ్లాం చేసిన బడిత పూజ అంతా సెల్ ఫోన్ల రికార్డు చేసి ఇంటర్నెట్ పెట్టిన్రు.. వీడియో చూసినోళ్లంతా మంచి పని చేసినవ్ అక్కా అని మెచ్చుకుంటున్నరు. 

మధ్య ప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ జిల్లాల జరిగింది గీ ముచ్చట.. ఇండ్ల మధ్యన మందుషాపు పెట్టి మొగోళ్లను తాగుబోతులను చేసి కరాబ్ చేస్తుండ్రని ఆడోళ్ళంతా వైన్స్ దుకాణం ముందల ఆందోళనకు దిగిన్రు. దుకాణం బంద్ చేసేదాక కదలం అని పట్టుబట్టిన్రు. ఇంతల్నే ధర్నా చేస్తున్న ఓ అక్క మొగుడు ఫుల్లుగా తాగొచ్చి రచ్చరచ్చ చేసిండు.. తాగుడు బంద్ చేయాలని మేం ధర్నా చేస్తుంటే.. నడిమిట్ల నీ గోలేందని..మందుబాబును కరెంట్  పోల్ కు కట్టేశిన్రు.. నోటికి ప్లాస్టర్ రేసి నోరు మూయించిన్రు. 

 ►ALSO READ | మీరు మనుషులేనా : మహిళను నగ్నంగా.. చెప్పుల దండతో ఊరేగించారు..!

ఆడోళ్లు చేస్తున్న ధర్నా సంగతి లోకల్ లీడర్లకు ఎరుకైంది. అసలే ఆడోళ్లు.. మళ్ల ఓట్లు ఏస్తరో ఏయరో అని .. ఎమ్మెల్యే, ఎంపీలు, చోటోమోటా లీడర్లంతా వచ్చిన్రు. మందు దుకాణం మూయిస్తంగానీ ఆందోళన విరమించుర్రీ  హామీ ఇచ్చిన్రు. ఇక అట్లా లీడర్ల హామీతోని అక్కలంతా నిమ్మలపడిన్రు. పోలీసుల కలగజేసుకొని సదరు తాగుబోతు కట్లు, ప్లాస్టర్ ఊడబిగి ఇగపో.. సక్కగా ఉండని అక్కడినుంచి పంపిన్రు. 

©️ VIL Media Pvt Ltd.