
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో ప్రత్యేక ఫిట్‌నెస్ ట్రైనింగ్, ట్రెక్కింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. డైరెక్టర్ జక్కనం తెరకెక్కిస్తున్న భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ వారణాసి కోసం శారీరకంగా సిద్ధమవుతున్న మహేష్, కఠినమైన వర్కౌట్స్‌తో పాటు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా మహేష్తో జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ (Black Forest) ప్రాంతంలో భారీ యాక్షన్ సన్నివేశాలను జక్కన్న చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ ఎపిసోడ్స్‌లో మహేష్ షర్ట్‌లెస్ లుక్‌లో కనిపించనున్నారని, ఇందుకోసం ప్రత్యేక ఫిట్‌నెస్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, యాక్షన్‌తో రూపొందుతున్న ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గతంలో మహేష్ జర్మనీ డైరీ నుంచి పంచుకున్న ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అక్కడ ప్రకృతి ఒడిలో ట్రెక్కింగ్ చేస్తూ, సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ హ్యారీతో కలిసి దిగిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఈ ట్రైనింగ్… సినిమా యాక్షన్ సన్నివేశాల కోసమేనా అనే విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అతిత్వరలోనే ఈ షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుందని సమాచారం
ఇంకా 80 రోజుల షూటింగ్..
ఇటీవలే దర్శకధీరుడు S. S. రాజమౌళి వారాణసిపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఫ్రాన్స్‌లో జరిగిన RRR స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి.. సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో ఇంకా సుమారు 80 రోజుల పని మిగిలి ఉందని వెల్లడించారు. భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తైందని, మిగిలిన చిన్న భాగాలను వచ్చే 80 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
►ALSO READ | Chiranjeevi : ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. దసరా బరిలో మెగాస్టార్ విశ్వరూపం!
5 పాత్రలతో మహేష్ బాబు విశ్వరూపం…
మహేష్ బాబు ఈ చిత్రంలో ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే టాక్ గతకొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే రుద్ర, శ్రీరాముడి పాత్రలతో అలరిస్తాడని వింటూ వచ్చాం. కానీ, ఈ రెండు పాత్రలతో పాటుగా శివుడు, ప్రాచీన భారతదేశానికి చెందిన ఓ రాజు, మరో రహస్య పాత్రలోనూ నటిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే మరోవైపు, ఇదంతా అవాస్తవమని, కేవలం రుద్రుడిగా, రాముడిగా మాత్రమే కనిపిస్తారని అంటున్నారు.
Mahesh Babu as RUDHRA in #VARANASI. pic.twitter.com/YMUjnnytWX
— rajamouli ss (@ssrajamouli) November 15, 2025
అయితే, ఈ ఐదు అవతారాల స్పష్టమైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రచారం నిజమైతే, మహేశ్ బాబు అభిమానులకు ఇది నిజంగానే ఒక పెద్ద పండగ. ఈ చిత్రం ఇండియన్ సినిమాకు మరో ఆస్కార్ రేంజ్ విజయాన్ని అందిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
April 7th, 2027… #VARANASI. pic.twitter.com/9i5j1TZg5b
— rajamouli ss (@ssrajamouli) January 30, 2026
ఈ ప్యాన్-వరల్డ్ చిత్రంలో మహేశ్ బాబుకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషించనుంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు..ఈ కాస్టింగ్ తో పాటు పలువురు స్టార్ లు దీనిలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కేవలం భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేయాలనేది రాజమౌళి లక్ష్యంగా ఉన్నారు.. ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణన్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది..