
ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలపై లైంగిక కంటెంట్‌ను ప్రోత్సహించే యాడ్స్ కనిపించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ మెటాకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నోటీసులిచ్చేందుకు సిద్దమైంది.
బీబీసీ ప్రచురించిన కథనం ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించి అభ్యంతరకర యాడ్స్ కనిపించాయి. వాటి ద్వారా తక్కువ ధరకు అక్రమ కంటెంట్ అందించే టెలిగ్రామ్ ఛానళ్లకు లింకులు ఇచ్చినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం మెటాను వివరణ కోరాలని నిర్ణయించింది.
►ALSO READ | దేశ పౌరులను బానిసలుగా చేస్తున్నారా.. అమిత్ షా డౌన్ డౌన్ అంటే తప్పేముందీ : ముంబై హైకోర్టు వ్యాఖ్యలు
ఈ ఆరోపణలపై మెటా స్పందిస్తూ..పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్ అత్యంత తీవ్రమైన నేరమని,అలాంటి కంటెంట్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటికే 40 లక్షలకు పైగా ఖాతాలను తొలగించినట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండే వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన యూజర్‌నేమ్ ఫీచర్ విషయంలో కూడా కేంద్రం మెటాకు నోటీసు జారీ చేసింది. ఈ ఫీచర్ వల్ల ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వంతో చర్చలు పూర్తయ్యే వరకు ఆ ఫీచర్‌ను అమలు చేయొద్దని మెటాకు ఆదేశించింది.