Reading Time: < 1 minute
Congress Vs BRS: సవాళ్లు-ప్రతిసవాళ్లు.. హైదరాబాద్‌లో హైటెన్షన్.. హరీష్ రావు అరెస్ట్

తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ హైఓల్టేజ్‌ ఫైట్‌ కొనసాగుతోంది.. తెలంగాణ అప్పులపై అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్.. చర్చకు సిద్ధమయ్యాయి.. దీంతో తెలంగాణ భవన్, గన్ పార్క్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరగగా.. మాజీ మంత్రి హరీష్ రావు కిందపడ్డారు. దీంతో తెలంగాణ భవన్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఇదిలాఉంటే.. మంత్రులు పొన్న ప్రభాకర్, అజారుద్దీన్, లక్ష్మణ్ సహా.. కాంగ్రెస్ నేతలు గన్ పార్క్ దగ్గరకు చేరుకున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.. కాగా.. గన్ పార్క్ కు వెళ్తున్న హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్‌తో అసలు సినిమా స్టార్ట్ అయింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతే మాస్‌గా స్వీకరించారు.”సవాల్‌ను స్వీకరిస్తున్నా.. చర్చకు వరంగలైనా సరే, హైదరాబాద్ అశోక్‌నగరైనా సరే… నేను రెడీ” అంటూ కేటీఆర్ ప్రతిసవాల్ విసిరి మరింత హీట్‌ పెంచారు. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ అవసరం లేదు..తానే సమాధానం ఇస్తానంటూ రియాక్ట్ అయ్యారు మంత్రి జూపల్లి. అక్కడో ఇక్కడో ఎందుకు ఉదయం 11 గంటలకు నేరుగా తెలంగాణ భవన్‌కే వస్తున్నా.. కమాన్‌ కేటీఆర్ కాస్కో అంటూ పొలిటికల్‌గా హైవోల్టేజ్ క్రియేట్ చేశారు. దీంతో కేటీఆర్, హరీష్ రావుతోపాటు బీఆర్ఎస్ శ్రేణులు.. భవన్ కు భారీగా చేరుకున్నారు.

లైవ్ వీడియో చూడండి..