Reading Time: 3 minutes

జ్యోతిష్యం : సింహరాశిలోకి శుక్రుడు.. 3 రాశుల వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం

Caption of Image.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, శారీరక సుఖాలకు కారకుడైన శుక్రుడు… సింహరాశిలో ఎంతో హుందాగా వ్యవహరిస్తాడు. జులై 4 వ తేది రాత్రి 7:14 గంటలకు శుక్రుడు కర్కాటక రాశిని విడిచి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడిని తొమ్మిదవ స్థానం నుంచి గురువు, సప్తమ స్థానం నుంచి శనీశ్వరుడు వీక్షిస్తున్నందువల్ల ఈ గ్రహ కారకత్వాలలో కొంత మార్పు చోటు చేసుకుంటుంది. మూడు రాశుల వారి( సింహ, వృశ్చికం, తుల) రాశుల వారి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తుంది.ఈరాశుల వారి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్నరచుకుంటుందని పండితులు చెబుతున్నారు.   వీటితో పాటుగా మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .!

మేష రాశి:  సింహరాశిలో శుక్రుడు సంచరించడవతో ఈ రాశి వారికి  అన్ని రంగాల్లో  విజయం పొందే అవకాశం ఉంది. కాని చాలా కష్ట పడవలసి ఉంటుంది.  నిలిచిపోయిన పనులు కూడా ప్రారంభించేందుకు ప్రయత్నం చేయండి.  వివాహితులు తమ కుటుంబాలతో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఆలస్యంగా అయినా అనుకున్న పనులు నెరవేరడంతో జీవితంలో ఆనందం పెరుగుతుంది. వాహనాలు, ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన ప్రణాళికలు పూర్తి చేసుకుంటారు. విద్య, వృత్తి వ్యాపారాల్లో అనుకోని ప్రగతి సాధిస్తారు.కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి మంచి సమయం.  ఉద్యోగస్తులకు అనుకోకుండా ప్రమోషన్​ వచ్చి  వేతనం పెరుగుతుంది. 

వృషభ రాశి:  సింహరాశిలో శుక్ర గ్రహం సంచారం వలన ఆ రాశివారు తమ కుటుంబం పట్ల మరింత ఎక్కువ అంకిత భావాన్ని పెంచుకుంటారు. ఇంటిపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. వృత్తిపరంగా మరో మెట్టుపైకి ఎక్కనున్నారు.  పెండింగ్ లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి.  వృత్తి, ఉద్యోగాలలో సహచరులతో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. సాధారణ పరిచయం నుంచి ప్రేమలోకి దిగిపోవడం జరుగుతుంది.ప్రేమ వ్యవహారాల్లో భారీగా ఖర్చయ్యే అవకాశం కూడా ఉంటుంది. 

మిథున రాశి: శుక్రుడు సింహరాశిలో సంచరించడం వలన  ఈ రాశివారికి లక్ష్మీనారాయణ యోగం కలిగి అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.  కార్యాలయంలో పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. బాధ్యతలతో పాటు  జీతం పెరుగుదలలో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రంద ద్వారా తెలుస్తుంది. 

కర్కాటక రాశి: సింహరాశి  ద్వితీయ స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల ఈ రాశి వానిరి  ప్రేమ జీవితం నుంచి పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ప్రేమ భాగ స్వామికి భారీగా కానుకలు, వస్త్రాభరణాల కొనివ్వడం వంటివి జరుగుతాయి. .. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.  కొత్త వ్యాపారాలు చేయడానికి అనుకూల సమయం. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే.. అదృష్టం కలిసి వస్తుంది.  ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. 

సింహరాశి: ఇదే  రాశిలోనే  శుక్రుడు సంచారం వలన ఈ రాశి వారికి  ప్రతి విషయంలోనూ అంతా అనుకూలంగానే జరుగుతుంది. రొమాంటిక్ లైఫ్ మరింత ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారు.  కార్యాలయంలో ఉన్నతాధికారులు అండదండలు పుష్కలంగా ఉంటాయి. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా వాటిని అమలు చేయండి.  విజయం  మీ వెంటే ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ముఖ్యమైన ఒప్పందాలు, కాంట్రాక్టులు లాభదాయకంగా మారవచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.నిరుద్యోగులకు సంబంధించిన శుభవార్తలు కుటుంబ ఆనందాన్ని మరింత పెంచుతాయి.

 కన్యారాశి: సింహరాశిలో శుక్ర సంచారం వలన ఈ రాశి వారి లగ్జరీ వస్తువులను కొనుగోలు చేస్తారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే అవకాశం కూడా రావచ్చు.  పూర్వీకుల ఆస్తి నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగాలు చేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆదాయ పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.

 తులారాశి: సింహరాశిలో శుక్రుడు సంచారం వలన .ఈ రాశికి  చెందిన వ్యాపారస్తులు  సామాన్య లాభాలను పొందే అవకాశం ఉంది.గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు  లభించవచ్చు. కొందరికి పదోన్నతి లేదా వేతన పెంపు కూడా దక్కవచ్చు. కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ముఖ్యమైన ఒప్పందాలు, కాంట్రాక్టులు లాభదాయకంగా మారవచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముంది.  దీర్ఘ కాలంగా ఉన్న రుణాలను తిరిగి చెల్లించగలుగుతారు. వ్యాపారస్థులు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సంతానం, ఆరోగ్యం గురించి ఆందోళన చెందే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు.  అన్ని పనులు ప్రశాంతంగా జరుగుతాయి. కొత్త ప్రేమలు పుట్టుకువస్తాయి.

వృశ్చికరాశి: సింహరాశిలో… శుక్క  సంచారం వలన  వృశ్చిక రాశి వారికి వ్యాపారం పరంగా  అనుకూల సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం.వృత్తి, కెరీర్ పరంగా అద్భుత ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో పురోగతి, కొత్త అవకాశాలు, ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లగలుగుతారు. . ఆర్థికంగా కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ వనరులు పెరగవచ్చు. అదృష్టం అనేక సందర్భాల్లో మీకు తోడ్పడుతుంది. అదే సమయంలో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రేమ మరియు వ్యక్తిగత జీవితం శృంగారభరితంగా ఉండబోతుంది.అన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. 

ధనస్సు రాశి: సింహరాశిలో …, శుక్రుడు  సంచారం వలన ఈ రాశి వారు ఆదాయాన్ని పెంచుకోవడానికి  ఇదే సరైన సమయం.   మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.ఆర్థిక పరిస్థితి  మెరుగుపడుతుంది.పెళ్లికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది.  భారీగా డబ్బును పొదుపు చేస్తారు. మీ పనులున్న అనుకున్న సమయానికి సక్రమంగా పూర్తవుతాయి. మీరు కోరుకున్న వ్యక్తితోనే వివాహం జరుగుతుంది. కెరీర్ టర్న్ అవుతుంది. మీ సంపద వృద్ధి చెందుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. మీరు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు

మకరరాశి: సింహరాశిలో…  శుక్రుడి సంచారం వలన చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉన్న వారు తమకు నచ్చిన కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశముంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కలలు కూడా నెరవేరుతాయి. పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ వస్తుంది. వ్యాపారస్థులు పాత సమస్యల నుంచి సమర్థవంతమైన మార్గాన్ని కనుగొంటారు. మీ భాగస్వామితో మీ సంబంధం చాలా బాగుంటుంది. విహార యాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉందని పండితులు చెబుతున్నారు.

కుంభరాశి:  శుక్రుడు.. సింహరాశిలో సంచరించడం వలన   జీవిత భాగస్వామితో మరింత ఎక్కువగా బంధం బలపడుతుంది. వ్యాపారాలు చేసేవారికి ఇది మరింత అనుకూల సమయం. ఎక్కువ ఆర్థికంగా ఎదుగుతారు. అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. స్నేహితులు పెరుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకోని మార్పులు సంభవిస్తాయి.  ఉద్యోగులకు వేతనం పెరిగే అవకాశం ఉంది.  అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

మీన రాశి:  శుక్రుడు.. సింహ రాశిలో సంచారం వలన ఈ రాశి వారికి  గత కొన్నిరోజులుగా మీ ఆరోగ్యం బాగా లేకపోతే చింతించకండి. రాబోయే రోజుల్లో ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపారంలో సానుకూల మార్పులు కూడా వస్తాయి. దాని కారణంగా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు పనికి సంబంధించి లాభదాయకమైన ప్రయాణాలు చేస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదన కూడా వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే మీ జీతం కూడా పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.