
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ iQOO తన Z సిరీస్‌లో కొత్త ఫోన్ iQOO Z11iను అధికారికంగా విడుదల చేసింది. భారీ 6500mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. బడ్జెట్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ డివైస్ మంచి బ్యాటరీ బ్యాకప్‌తో పాటు రోజువారీ వినియోగానికి అవసరమైన అన్ని ఫీచర్లను అందిస్తోంది.
iQOO Z11i ధర, లభ్యత
ప్రస్తుతం iQOO Z11i చైనాలో మూడు వేరియంట్లలో విడుదలైంది.
6GB + 128GB – 1,299 యువాన్ (సుమారు రూ.18,000)
8GB + 128GB – 1,499 యువాన్ (సుమారు రూ.21,000)
8GB + 256GB – 1,699 యువాన్ (సుమారు రూ.24,000)
ఈ ఫోన్ Ink Shadow, Qingfeng (Green), Desert Gold అనే మూడు రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.
120Hz HD+ డిస్‌ప్లే
iQOO Z11iలో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు.
డిస్‌ప్లే ఫీచర్లు:
1600 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్
120Hz రిఫ్రెష్ రేట్
1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్
DC Dimming
TÜV Rheinland Low Blue Light సర్టిఫికేషన్
ఈ ఫీచర్లు కంటి ఒత్తిడిని తగ్గించడంతో పాటు మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందిస్తాయి.
Snapdragon 4 Gen 2 ప్రాసెసర్
పనితీరు కోసం ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 8GB వరకు LPDDR4X RAM, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. అదనంగా మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం కూడా ఉంది. ఈ ఫోన్ Android 16 ఆధారిత OriginOS 6పై పనిచేస్తుంది.
కెమెరా
ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 13MP రియర్ కెమెరా (ఆటోఫోకస్‌తో), 1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్ ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా అందించారు.
భారీ 6500mAh బ్యాటరీ
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ 6500mAh బ్యాటరీ. 15W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు
సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
USB Type-C పోర్ట్
Bluetooth 5.1
IR Blaster
3.5mm హెడ్‌ఫోన్ జాక్
IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లను కూడా అందించారు.