
Red Card Controversial: ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ పోరులో బోస్నియా అండ్ హెర్జెగోవినాపై విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు అమెరికా చేరినప్పటికీ, సహ-ఆతిథ్య దేశం USAకు ఊహించని బిగ్ షాక్ తగిలింది. ఈ టోర్నమెంట్‌లో అమెరికా తరఫున 3 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా ఉన్న స్టార్ స్ట్రైకర్ ఫోలారిన్ బాలోగన్.. నిన్న (బుధవారం, జులై 1న) జరిగిన మ్యాచ్‌లో బోస్నియా డిఫెండర్ తారిక్ ముహరెమోవిచ్‌పై చేసిన ఫౌల్‌కు గాను రెడ్ కార్డ్ తీసుకుని మైదానాన్ని వీడాడు. రెఫరీ మొదట కార్డ్ తీయనప్పటికీ, VAR (వీడియో అసిస్టెంట్ రెఫరీ) అలర్ట్ చేయడంతో పిచ్‌సైడ్ మానిటర్‌ను పరిశీలించి బాలోగన్‌కు డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇచ్చారు.
అప్పీల్ చేసుకునే అవకాశం లేదన్న ఫిఫా:
అమెరికా జట్టు 10 మందితోనే ఆడి మ్యాచ్ గెలిచినప్పటికీ, తదుపరి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో బెల్జియంతో తలపడాల్సి ఉంది. ఈ కీలక మ్యాచ్‌కు బాలోగన్ దూరం కావడం యూఎస్ఏ అవకాశాలను దెబ్బతీసేలా ఉంది. రెఫరీ నిర్ణయం చాలా కఠినమైనదని అమెరికా మేనేజ్‌మెంట్ భావించినప్పటికీ.. ఫిఫా నిబంధనల ప్రకారం ఈ రెడ్ కార్డ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పీల్ చేసుకునే ఛాన్స్ లేదు.. ఎందుకంటే, వరల్డ్ కప్ ఆర్టికల్ 66.4 ప్రకారం ఒక మ్యాచ్ సస్పెన్షన్ ఆటోమేటిక్‌గా అమలు అవుతుంది, క్రమశిక్షణా కమిటీ భావిస్తే ఈ నిషేధాన్ని మరికొన్ని మ్యాచ్‌లకు పొడిగించే అధికారం కూడా ఉందని ఫిఫా అధికారి ఒకరు తెలిపారు.
ALSO READ : నన్ను కూడా చెక్ చేస్తారా?.. సెక్యూరిటీని చూసి పగలబడి నవ్విన మెస్సీ
రెఫరీ నిర్ణయంపై యూఎస్ కోచ్ ఫైర్:
బాలోగన్ కావాలని ఆ ఫౌల్ చేయలేదని, బంతి కోసం ట్రై చేస్తున్నప్పుడు జరిగిన జనరల్ యాక్షన్ అని అమెరికా కోచ్ మారిసియో పొచెట్టినో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యర్థిని గాయపరచాలనే ఉద్దేశం బాలోగన్‌కు అస్సలు లేదని, రెడ్ కార్డ్ ఇవ్వడం ఎంతమాత్రం అమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. అలాగే జట్టు స్టార్ వింగర్ క్రిస్టియన్ పులిసిక్ మాట్లాడుతూ.. ఆ రెడ్ కార్డ్ నిర్ణయం దురదృష్టకరం.. మేము దానికి అర్హులం కాదు.. అయినప్పటికీ 10 మందితోనే అద్భుతంగా డిఫెండ్ చేస్తూ మరో గోల్ కొట్టి గెలవడం మా జట్టు యొక్క గొప్పతనం అన్నాడు. మిడ్‌ఫీల్డర్ వెస్టన్ మెక్కెన్నీ కూడా అప్పీల్ చేసుకునే ఛాన్స్ లేకపోవడాన్ని తప్పుబడుతూ, టోర్నీలో ఇలాంటి మరెన్నో ఛాలెంజ్‌లకు కార్డే ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు.