Reading Time: < 1 minute

రెండో రోజూ షాకిచ్చిన బంగారం.. 10 గ్రాములకు రూ.3వేల 220 పెరిగిన గోల్డ్

Caption of Image.

నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు అదే దూకుడును శుక్రవారం కూడా కొనసాగించాయి. దాదాపు గత 15 రోజులుగా నెమ్మదించిన పసిడి పరుగులు మళ్లీ తిరిగి ఊపందుకోవటం ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నప్పటికీ.. రిటైల్ షాపర్లకు మాత్రం శాపంగా మారింది. దీంతో ఇంకా రేట్లు తగ్గితే షాపింగ్ చేద్దాం అని ప్లాన్స్ చేసుకుంటున్న మధ్యతరగతి ఫ్యామిలీలకు వరుస పెరుగుదల పెద్ద షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లో పెరిగిన ధరలను పరిశీలించటం బెటర్ ముందుగా.

జూలై 3న బంగారం రేట్లు పెరిగాయి. జూలై 2 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.322 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 700గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 475గా కొనసాగుతోంది. 

శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 3, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 60వేలుగా స్థిరంగానే ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.260 దగ్గర ఉంది. 

©️ VIL Media Pvt Ltd.