
బోథ్(సొనాల), వెలుగు: అంగన్‌వాడీ టీచర్‌ను వేధింపులకు గురి చేసిన ప్రభుత్వ టీచర్‌ను అరెస్ట్ చేసినట్లు బోథ్ సీఐ రాజు బుధవారం తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన రాథోడ్ రాజు జన్నారం మండలంలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నాడు. జన్నారం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ విమలను కొంతకాలంగా ఉద్యోగపరంగా వేధింపులకు గురి చేస్తున్నాడు.
ఆర్టీఐ చట్టం ద్వారా ఆమె వ్యక్తిగత, ఉద్యోగ వివరాలు సేకరించి ఉద్యోగం పోయేలా చేస్తానని, లేకపోతే తనకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితురాలి కొడుకు శ్రీనివాస్ బోథ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.