Reading Time: < 1 minute

అసోంలో వరదల బీభత్సం.. మూడు రోజులుగా 220 గ్రామాలు నీళ్లల్లోనే..

Caption of Image.

అసోంలో భారీ వర్షాల కారణంగా వరదలు బీభిత్సం సృష్టించాయి.గత కొద్దిరోజులుగా కురుస్తు్న్న వర్షాలకు అసోం అతలాకుతలం అవుతోంది. వరదల ఉధృతి బుధవారం( జూలై 1) కూడా తగ్గేలా లేదు. ఆరు జిల్లాల్లో దాదాపు 50వేల మంది  ప్రజలు నిరాశ్రయులయ్యారు. మంగళవారం రాత్రి ధేమాజీ జిల్లాలోని సిస్సిబోర్‌గావ్‌లో వరద నీటిలో కొట్టుకుపోయి ఒక మహిళ మృతిచెందింది.

భారీ వర్షాలు, వరదలతో అసోం లోని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. బ్రహ్మపుత్రతో సహా రెండు ప్రధాన నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండగా, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇల్లు,పంట పొలాలు, రోడ్లు  కొట్టుకుపోయి తీవ్రనష్టం వాటిల్లింది. 

 దేమాజీ, నల్బరి,దిబ్రూగర్,చిరాంగ్, లఖింపూర్, బిస్వనాథ్ జిల్లాల్లో దాదాపు 221 గ్రామాలు పూర్తిగ వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఈ ప్రాంతాల్లో 45 వేల మందినిరాశ్రయులయ్యారు. వరదల ప్రభావంతో దేమాజీ జిల్లా తీవ్రంగా నష్టపోయింది. 

►ALSO READ | భార్య లావుగా ఉందని.. పిల్లలు పుట్టడం లేదని..గొంతు నులిమి చంపిన భర్త…

©️ VIL Media Pvt Ltd.