Reading Time: < 1 minute

బొల్లిగూడంలో ఉద్రిక్తత.. కల్వకుంట్ల కవిత అరెస్ట్, TRS కార్యకర్తలు నిరసన

Caption of Image.

మేడ్చల్ బొల్లిగూడ ప్రాంతంలో తెలంగాణ రక్షణ సేన (TRS) భూపోరాట సభ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూ పోరాట కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు అడ్డుకున్నారు.  అనంతరం ఆమెను కీసర పీఎస్ కి తరలించినట్టు సమాచారం అందుతోంది

కవిత అరెస్టు అనంతరం తెలంగాణ రక్షణ సేన ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు ఆందోళనకు చేశారు. ఇదే సమయంలో బోడుప్పల్ బొల్లిగూడ ప్రాంతంలోని దళితుల భూములను ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వాధీనం చేసుకుని ఎకరానికి 600 గజాల చొప్పున ప్లాట్లు కేటాయించే ప్రక్రియ కొనసాగుతోందని దళితులు తెలిపారు.  తెలంగాణ రక్షణ సేన భూముల స్వాధీనానికి భూ పోరాటం ద్వారా బోడుప్పల్ బొల్లిగూడం ప్రాంతానికి రావడంతో, దళితులు వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
 

©️ VIL Media Pvt Ltd.