
వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీనికి సంబంధించిన అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఎత్తు పెరిగేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉంటుంది. రాబోయే 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందనిఅమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న నైరుతి ఋతపవన ద్రోణి ఇప్పుడు వాయువ్య రాజస్థాన్ నుండి నైరుతి ఉత్తర ప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లపై అంతర్లీనంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో పాటు ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంత కేంద్రం వరకు విస్తరించి ఉంది. సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. గాలులు కోత (షియర్ జోన్ ) సుమారుగా 21° ఉత్తర అక్షాంశం వెంబడి,సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.
ఏపీలో భారీ వర్షాలు..
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాబోయే మూడ్రోజు పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది . ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంని అమరావతి వాతావరణ కేంద్ర స్పష్టం చేసింది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలో కూడా నేడు, రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. అటు కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణకు వర్షసూచన
తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన జారీ చేసింది. పలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద ఉండవద్దని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది.